- పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్లలో వచ్చిన ఒక కొత్త వేరియంట్
- ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మోడ్స్, మరెన్నో ఫీచర్లతో కొత్త వేరియంట్లు
గత వారం మేము రాబోయే (అప్‍కమింగ్) కియా సెల్టోస్ వేరియంట్‌లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ వార్తలను మీకు అందించాము. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ HTK+ వెర్షన్ రేంజ్ ని మరింత పెంచుతూ రెండు కొత్త వేరియంట్‌లను రూ. 15.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
కొత్తగా ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లు పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో HTK+ వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఆటోమేకర్ ఈ మోడల్ లో అద్బుతమైన ఫీచర్లను జోడించి ఈ వేరియంట్ ఫీచర్ లిస్టును కూడా అప్‍డేట్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, డ్రైవ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లను పొందింది.
కొత్త లాంచ్‌పై కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ స్పందిస్తూ, “సెల్టోస్ పట్ల ఇండియా కస్టమర్లు చూపుతున్న ఆప్యాయత చాలా ఎక్కువ. కొత్త తరం కస్టమర్ల కోసం కియా మోడల్స్ ని ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. రిఫ్రెష్డ్ 2024 సెల్టోస్‌లో, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి టాప్-ఎండ్ ప్రీమియం ఫీచర్లను జతచేసి మేము మోస్ట్ పాపులర్ వేరియంట్ - HTK+ని మరింత అందంగా, స్టైలిష్ గా మార్చాము. HTK+లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు 20-35 శాతం వరకు ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తిస్తూ, ఐవిటి మరియు 6ఎటి ట్రాన్స్‌మిషన్‌లను పరిచయం చేసాము, దీని ద్వారా కస్టమర్లలో సెల్టోస్ మరింత ఆకర్షణను పెంచుతుంది.” అని పేర్కొన్నారు.
కొత్తగా లాంచ్ అయిన వేరియంట్ల ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్- షోరూం ధర |
HTK+ పెట్రోల్ సివిటి | రూ. 15.40 లక్షలు |
HTK+ డీజిల్ఎటి | రూ. 16.90 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్