- ఇప్పుడు కొత్తగా GTX వేరియంట్‌ని తీసుకు వచ్చిన సెల్టోస్
- X లైన్ వేరియంట్ లో జతచేయబడిన బ్లాక్ కలర్ ఆప్షన్
కియా ఇండియా, ఇండియన్ మార్కెట్ లో దాని రేంజ్ లైనప్‌లో సరికొత్త మార్పులు చేసింది. ఈ అప్‌డేట్ లో భాగంగా మిడ్-సైజ్ ఎస్‌యువి కొత్త వేరియంట్ మరియు కొత్త కలర్ ఆప్షన్ ను పొందింది. ముఖ్యంగా చెప్పాలంటే , కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో మాత్రమే ఈ కొత్త GTX వేరియంట్ అందించబడుతుంది.
కియా సెల్టోస్ X లైన్, గతంలో ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ కలర్ తో మాత్రమే అందించబడగా, ఇప్పుడు ఈ వేరియంట్ కొత్త అరోరా బ్లాక్ పెర్ల్ పెయింట్‌తో అందుబాటులో ఉంది. అలాగే, సోనెట్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువిలో కూడా దీని పోలి ఉండే (ఇదే విధమైన)అప్‌డేట్ చేయబడిన, వాటి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అదనంగా, సెల్టోస్ ఇప్పుడు కొత్త GTX వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇది రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి, ఒకటి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డిసిటి మరియు రెండోది 1.5-లీటర్ డీజిల్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్, వీటి ధర రూ. 19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే, పైన ఉన్న HTX+ వేరియంట్‌తో పోలిస్తే, GTX వేరియంట్‌లో ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప