- టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ టైపులో లభ్యం
- X-లైన్ వేరియంట్లో కొత్తగా వచ్చిన అరోరా బ్లాక్ పెర్ల్ కలర్
లేటెస్టుగా సౌత్ కొరియన్ కార్ల కంపెనీ కియా సెల్టోస్ లో కొత్త వేరియంట్లను తీసుకురావడంతో పాటుగా ధరల పెంపుకు సంబంధించిన స్పెషల్ న్యూస్ ని మీకు అందించాము. ఇప్పుడు, కియాబ్రాండ్ అధికారికంగా HTX+ మరియు GTX+ (S) వేరియంట్ల మధ్య కొత్తగా GTX వేరియంట్ ని రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది.
కొత్త GTX వేరియంట్ టాప్-స్పెక్ వేరియంట్ల నుండి చాలా కీలకమైన ఫీచర్లను అందుకుంది. ఈ ఫీచర్లలో సోలార్ గ్లాస్ లేదా యువి-కట్ గ్లాస్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవెల్-2ఎడాస్ (ఏడీఏఎస్)సూట్ ట్రిమ్-డౌన్ వెర్షన్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, వైట్ కాలిపర్స్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా ఉన్నాయి. అదే విధంగా, యువి-కట్ గ్లాస్ మరియు వైట్ కాలిపర్స్ ఇప్పుడు GTX+ మరియు X-లైన్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, X-లైన్ వేరియంట్లకు ఇప్పుడు అరోరా బ్లాక్ పెర్ల్ అనే బేసిక్ గ్లోస్-ఫినిష్డ్ బ్లాక్ పెయింట్ పిలువబడే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ని కూడా తోడయ్యింది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల విషయానికొస్తే, సెల్టోస్ కొత్త GTX వేరియంట్లో రెండు ఇంజన్ ఆప్షన్లు మీకు అందించబడ్డాయి. అవి ఏంటి అంటే, 1.5-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజిన్లలో మొదటి 1.5-లీటర్ లీటర్ టిజిడిఐ టర్బో- పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి యూనిట్ తో జత చేయబడగా, 1.5-లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్