- పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందించబడిన కొత్త వేరియంట్
- HTX వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లు గ్రావిటీ వేరియంట్లో లభ్యం
ఇండియాలో కియా కంపెనీ నుంచి వచ్చిన సోనెట్, సెల్టోస్ మరియు కారెన్స్ అనే మూడు కార్లు చాలా పాపులర్ మోడల్స్ గా నిలిచాయి. అయితే, ఆటోమేకర్ ఇప్పుడు కొత్తగా ఈ మూడు మోడల్స్ లో గ్రావిటీ వేరియంట్ ని తీసుకు వచ్చింది. ఇప్పుడు మనం మూడింట్లో ఒకటైన సెల్టోస్ మోడల్ లో కొత్తగా వచ్చిన గ్రావిటీ వేరియంట్లో లభించే అంశాలను తెలుసుకుందాం. సెల్టోస్ ఎస్‌యూవీలో వచ్చిన ఈ కొత్త వేరియంట్ HTX వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండగా, దీని ఎక్స్-షోరూం ధర రూ.16.63 లక్షల నుంచి ప్రారంభమైంది.
కొత్త కియా సెల్టోస్ గ్రావిటీ వేరియంట్లోని ఫీచర్లు చాలానే ఉన్నాయి, అందులో డాష్ కెమెరా, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్ మరియు గ్రావిటీ బ్యాడ్జి వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, గ్రావిటీ వేరియంట్ మూడు కలర్లలో లభిస్తుంది. అందులో గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్ మరియు డార్క్ గన్ మెటల్ మ్యాట్ ఫినిష్ వంటివి ఉన్నాయి.
మెకానికల్ గా, సెల్టోస్ గ్రావిటీ కారును 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ట్రాన్స్మిషన్ ఆప్షన్ల పరంగా చూస్తే, పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఐఎంటి యూనిట్ గేర్ బాక్సుతో అందుబాటులో ఉండగా, మరియు డీజిల్ ఇంజిన్ ఎక్స్‌క్లూజివ్ గా మాన్యువల్ గేర్ బాక్సుతో అందుబాటులో ఉంది.
కొత్త కియా సెల్టోస్ గ్రావిటీ ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్లు | ఎక్స్-షోరూం ధరలు |
కియా సెల్టోస్ గ్రావిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఎంటి | రూ. 16.63 లక్షలు |
కియా సెల్టోస్ గ్రావిటీ 1.5- లీటర్ పెట్రోల్ ఐఎంటి | రూ. 18.06 లక్షలు |
కియా సెల్టోస్ గ్రావిటీ 1.5- లీటర్ డీజిల్ ఎంటి | రూ. 18.21 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్