- రూ. 16.63 లక్షలతో ధరలు ప్రారంభం
- HTX వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లతో లభ్యం
కియా సెల్టోస్ ఇటీవలే దాని కొత్త గ్రావిటీ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిని రూ. 16.63 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ కొత్త వేరియంట్ HTX వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లతో సరికొత్త లుక్ తో అందుబాటులోకి రాగా, ఇప్పుడు, లాంచ్ తర్వాత, ఈ మోడల్ ఇండియాలోని అన్ని డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఫీచర్ల పరంగా చూస్తే, కియా సెల్టోస్ గ్రావిటీ లో 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డాష్ కెమెరా, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, మరియు గ్రావిటీ బ్యాడ్జ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కొత్త వేరియంట్ గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్ మరియు డార్క్ గన్ మెటల్ మాట్టే ఫినిషింగ్ తో మూడు ఎక్స్‌టీరియర్ కలర్స్ లో లభిస్తుంది.
మెకానికల్‍గా, సెల్టోస్ గ్రావిటీ రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో - 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అందించబడుతోంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, డీజిల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు సీవీటీ యూనిట్ తో అందించబడుతుంది.
మరో వార్తలలో చూస్తే , కొరియన్ ఆటోమేకర్ నుంచి అప్ కమింగ్ (రాబోయే) ఎంపివి కొత్త కార్నివాల్ ద్వారా భారీ బుకింగ్ మైలురాయిని సాధించింది. ఈ కారు బుకింగ్‌లు ప్రారంభమైన 24 గంటలలోపే, ఈ మోడల్ పై కార్‌మేకర్ రూ. 2 లక్షల టోకెన్ అమౌంట్ తో 1,800 బుకింగ్‌లను నమోదు చేసింది.
అనువాదించిన వారు: రాజపుష్ప