- జూలై-2023లో లాంచ్ అయిన మోడల్
- టాప్ వేరియంట్లను ఎంచుకున్న 80 శాతం కస్టమర్లు
మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ద్వారా కియా ఇండియా సరికొత్త మైల్‌స్టోన్‌ని చేరుకుంది. ఈ కొరియన్ ఆటోమేకర్ కొత్త కియా సెల్టోస్ తో లక్ష బుకింగ్స్ ని అధిగమించింది. ఈ మోడల్ జూలై-2023లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ప్రతి నెలా సగటున 13,500 యూనిట్ల బుకింగ్ ని రిజిస్టర్ చేసింది.
బ్రాండ్ ప్రకారం, 80 శాతం కస్టమర్లు టాప్ వేరియంట్లను (HTK+ నుండి) ఎంచుకున్నారు. అదే విధంగా, అందులో 40 శాతం కస్టమర్లు ఏడీఏఎస్ (అడాస్) సూట్ తో ఈ మోడల్ ని ఎంచుకున్నారు. అలాగే, మొత్తంగా 80 శాతం కస్టమర్లు పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ని కలిగి ఉన్న వేరియంట్లను ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు.
గత సంవత్సరం జూలై నెలలో లాంచ్ అయిన తర్వాత ఈ ఎస్యూవీ మొదటి రోజునే 13,000 పైగా బుకింగ్స్ అందుకుంది. నెలలోపే, ఆగస్టులో ఈ ఎస్యూవీ 31,000 బుకింగ్స్ తో కొత్త రికార్డును సెట్ చేసింది. తర్వాత, పలుమార్లు సెల్టోస్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం కియా సెల్టోస్ రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
కియా సెల్టోస్ సక్సెస్ పైకియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, 'కొత్త సెల్టోస్ మార్కెట్ సక్సెస్ అవడంతో మేము సంతోషిస్తున్నాము. ఎలాంటి సందేహం లేకుండా, అందుబాటులో ఉన్న స్మార్ట్ ఎస్యూవీ ఆప్షన్లలో సెల్టోస్ ఒకటిగా నిలుస్తుంది. మా కస్టమర్ల నుండి వచ్చిన ప్రతిస్పందన సెంటిమెంట్‌ని తెలుపుతుంది. మిడ్-ఎస్యూవీ విభాగంలో మా మార్కెట్ లీడర్ షిప్ స్థిరంగా కొనసాగడానికి కొత్త సెల్టోస్ మాకు సహాయకరంగా ఉంది. మా కస్టమర్లు వారికి ఇష్టమైన ఎస్‌యూవీలను వీలైనంత త్వరగా పొందేలా మా మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తున్నాం. ప్రతి ప్రొడక్ట్ ని మరింత బెటర్ గా చేసేందుకు మద్దతునిచ్చే ఇండియాలోని సెల్టోస్ మరియు కియా అభిమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్