- 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యం
- అందుబాటులో ఉన్న 5 వేరియంట్స్
కియా ఇండియా జూలై, 2023లో అప్డేటెడ్ సెల్టోస్‌ను దేశం అంతటా లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆటోమేకర్ ఈఎస్యువిలో డీజిల్ మాన్యువల్ వేరియంట్లను లాంచ్ చేసింది, వీటి ధరలురూ.11,99,900 నుండి రూ.18,27,900 (రెండు ధరలు,ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి.
ఇందులో ఇప్పటివరకు, 114bhp మరియు 250Nm టార్క్‌ని విడుదల చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటి మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. వినియోగదారులు ఇప్పుడు HTE, HTK, HTK+, HTX మరియు HTX+లతో సహా 5 -వేరే వేరే వేరియంట్స్ నుండి 6-స్పీడ్ డీజిల్ మాన్యువల్ తో కలిపి ఎంచుకునే అవకాశం ఉంది.
ఫీచర్స్ పరంగా చూస్తే, ఈ న్యూ కియా సెల్టోస్‌లో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25-ఇంచ్ డిస్ప్లేస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు17-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
వేరియంట్ వారీగా న్యూ కియా సెల్టోస్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
HTE | రూ.11,99,900 |
HTK | రూ.13,59,900 |
HTK+ | రూ 14,99,900 |
HTX | రూ. 16,67,900 |
HTX+ | రూ. 18,27,900 |
అనువాదించిన వారు: రాజపుష్ప