- ప్రభావితమైన1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో కూడినసివిటి ట్రాన్స్‌మిషన్ మోడల్స్
- 2023లో తయారు చేసిన మోడల్స్ ను వెనక్కి రప్పించిన కియా
కియా ఇండియా తన సెల్టోస్ ఎస్‌యూవీలను దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా వెనక్కి రప్పించింది. 28 ఫిబ్రవరి నుండి 13 జూలై, 2023 మధ్య తయారు చేయబడిన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ తో కూడిన పెట్రోల్ సివిటి ట్రాన్స్‌మిషన్ 4,358 సెల్టోస్ యూనిట్లను కొరియన్ ఆటోమేకర్ వెనక్కి రప్పించింది. ఈ మోడల్స్ ను వెనక్కి రప్పించిన కారణం ఏమిటంటే, ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సంభావ్య లోపాన్ని పరిష్కరించకపోతే ఇందులో పేర్కొన్న ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లోని ఎస్‌యువి పెర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపవచ్చు.
దీని ఆటోమేకర్ సెల్టోస్ కి సంబంధించిన యజమానులను సంప్రదించి, రీప్లేస్ ద్వారా ప్రభావిత భాగాన్ని ఉచితంగా భర్తీ చేస్తుంది. ప్రస్తుతం, హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉన్న ఈ మోడల్ HTE, HTK, HTK ప్లస్, HTX, HTX ప్లస్, GTX ప్లస్, మరియు X-లైన్ అనే 7 వేరియంట్‌లలో పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ 5- సీటర్ యొక్క ధరలు రూ.10.90 లక్షలు నుంచి ప్రారంభమై, అక్కడి నుండి రూ. 20.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి.
మరో వార్తలో చూస్తే, ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ ఇటీవల ఇండియాలో 1 లక్ష బుకింగ్ మైలురాయిని అధిగమించింది. జూలై 2023లో లాంచ్ అయిన తర్వాత, ఈ ఎస్‌యువి సగటు నెలవారీగా 13,500 యూనిట్ల బుకింగ్‌లను నమోదు చేయగా, వీటిలో 80 శాతం మంది కొనుగోలుదారులు టాప్-స్పెక్ వేరియంట్‌లను ఎంచుకున్నారు.
అనువాదించిన వారు: రాజపుష్ప