- రూ.1.30 కోట్లతో లేటెస్టుగా ఇండియాలో లాంఛ్
- GT - లైన్ ఏడబ్లూడీ వెర్షన్లో మాత్రమే EV9 లభ్యం
కొరియన్ కార్ల తయారీ కంపెనీ కియా దాని ప్రీమియం ఇన్నింగ్స్ ని ఇండియాలో కార్నివాల్ ప్రీమియం మరియు EV9 ఎలక్ట్రిక్ కారును లాంఛ్ చేసి ఘనంగా ఆరంభించింది. మొదటిది ఇండియాలో మరోసారి కమ్ బ్యాక్ చేస్తుండగా, రెండవ కారు కియా నుంచి మొదటిసారిగా ప్రీమియం మార్కెట్ సెక్షన్ లో అరంగేట్రం చేస్తుంది. ఈ మూడు- వరుసల వెహికిల్ ని తీసుకురావడం ద్వారా కియా దాని లగ్జరీ ప్లాన్లను మరింత విస్తరించనుంది.
ఇంకా దీని గురించి ప్రారంభిస్తే, కియా EV9 కారు కేవలం ఒకే ఒక్క ఫుల్లీ లోడెడ్ టాప్ - స్పెక్ GT - లైన్ ఏడబ్లూడీ వెర్షన్లో మాత్రమే లాంఛ్ అయ్యింది. ఈ కారు ఎన్నో ఆకర్షణీయమైన అదనపు ఫీచర్లను కలిగి ఉండగా, వాటన్నింటినీ ఇండియాలో లాంఛ్ అయిన EV9 కారులో కియా కంపెనీ తీసుకువచ్చింది. అంతే కాకుండా, EV9 కారు దేశవ్యాప్తంగా టాప్ -10 సిటీల్లో ఉన్న 20 సెలెక్టెడ్ డీలర్ షిప్స్ వద్ద మాత్రమే విక్రయించబడుతుందని కియా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే, ఈ మోడల్ కి పైన పేర్కొన్న లోకేషన్లలో ఉండే అవకాశం ఉందని కియా భావిస్తుంది. చివరగా చెప్పేది ఏంటి అంటే, ఈ ఈవీ అధికారికంగా ఎన్ని నంబర్లలో వస్తుందో పేర్కొనబడలేదు. మార్చి-2025 నుండి ప్రారంభమయ్యే డెలివరీ ఆర్డర్ బుక్ ఆధారంగా కారును దిగుమతి అవుతుంది.
కియా కంపెనీ భవిష్యత్తులో EV9 మోడల్ ఒక కీలక పాత్ర పోషించనుంది. రెండు ఎలక్ట్రిక్ కార్లు లోకల్ గా తయారుకానుండగా, మొదటిది 2025 సంవత్సరంలోని ద్వితీయార్థంలో మరియు రెండవది 2026 సంవత్సరంలో రానున్నాయి. మొదటిది ఐసీఈ కారెన్స్ లాగా ఉండే కారెన్స్ ఈవీ అని మాకు తెలుసు. కానీ ఎలక్ట్రిక్ వెర్షన్లో వస్తుంది. రెండవది వచ్చే సంవత్సరం ఇండియాలో రెండవ కాంపాక్ట్ ఎస్‍యూవీ ఆధారంగా వచ్చిన సోనెట్ ఈవీలాగా ఉండవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్