- ఇండియాలో కియా నుంచి రెండవ ఎలక్ట్రిక్ కారుగా వస్తున్న ఈవీ9
- ఇదే సంవత్సరం కొత్త కార్నివాల్‌ను కూడా పరిచయం చేయనున్న కియా
ఈ నెల ప్రారంభంలో కియా తన ఉత్పత్తుల అప్‌డేట్‌ల రేంజ్ ని ప్రకటించిన తర్వాత కూడా కియా ఏమాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు, ఈకొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఈ సంవత్సరం తరువాత రెండు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నట్లు నిర్ధారించింది.
ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరియు న్యూ-జెన్ కార్నివాల్‌తో అనే రెండు కొత్త మోడల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కియా లాంచ్ చేయనుంది.కార్నివాల్ వచ్చే నెలల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నప్పటికీ, ఈవీ9 త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కియా ఇప్పటికే రెండు కార్లపై టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా, కేవలం రెండు నెలల క్రిత మే ఈవీ9 పై కూడా టెస్టింగ్ ప్రారంభించింది.ఇండియన్ మార్కెట్‌లో ఈ బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ కారుగా వచ్చేందుకు సిద్ధంగా ఉంది, ఇది 2డబ్ల్యూడి మరియు 4డబ్ల్యూడి రూపంలో అందించబడుతుండగా కేవలం ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 400-500కిమీల రేంజ్ ని అందిస్తుంది.
ఇండియా-స్పెక్ ఈవీ9కి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.ప్రారంభంలో ఈ కారు సిబియు రూట్ లో ఇండియాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము, డిమాండ్ ఆధారంగా సికెడి వెర్షన్ తో రానుంది. ఇది లెవెల్- 2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, రెండవ వరుస లో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్స్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో అమర్చబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప