- ఆధునాతన సీటింగ్ తో మూడు-వరుసలతో వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ
- 561 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న కొత్త EV9 జిటి-లైన్
కొత్త EV9 జిటి లైన్ వేరియంట్ ని నేడే ఇండియాలో రూ.1.30 కోట్ల ఎక్స్-షోరూం ధరతో దిగ్గజ కార్ల సంస్థ కియా మోటార్స్ లాంచ్ చేసింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును మీరు మీ అవసరాలకు అనుగుణంగా లీజుకు కూడా తీసుకోవచ్చు. అటువంటి ఆప్షన్ ని కియా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ కారు కొత్త కార్నివాల్ కారుతో పాటుగా ఆవిష్కరించబడింది.
ఎక్స్‌టీరియర్ డిజైన్
కార్ మేకర్ నుంచి మూడు-వరుసల పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అనే కియా EV9 అనే ఈ కొత్త కారు ఈ-జీఎంపీ ప్లాట్ ఫారం ఆధారంగా వచ్చింది. ఇది బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ తో షార్ప్-లుక్ ఫేసియా మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో నిలువుగా అమర్చబడిన ఎల్ఈడీ హెడ్ లైట్ల ద్వారా స్పోర్ట్స్ లుక్ ని కలిగి ఉంది. ఎల్ఈడీ టెయిల్ లైట్ల డిజైన్ ఒకేలా ఉండగా, ఈ ఎస్‍యూవీలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్స్ ఆర్చ్ లు వంటి ఫీచర్లు ఉన్నాయి. లాంచ్ సమయంలో, ఈ కారు స్టేజీపై 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో కనిపించింది.
ఇంటీరియర్ ఫీచర్స్
ఇంటీరియర్ పరంగా, EV9 కారు లోపల చూస్తే, మూడు వరుసల సీట్లతో మరియు డ్యాష్ బోర్డు సరికొత్త డిజైన్ ని కలిగి ఉంది. ఈ కారులో అందించబడిన అతిపెద్ద హైలైట్లలో ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టంని అనుసంధానం చేసేలా విశాలమైన స్క్రీన్ వంటివి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 27 లేటెస్ట్ అటానమస్ డ్రైవింగ్-అసిస్ట్ ఫీచర్లతో ఏడీఏఎస్ సూట్ ని బెస్ట్ సేఫ్టీ కారుగా వచ్చింది.
పవర్ ట్రెయిన్
ఇండియాలో EV9 జిటి-లైన్ లాంగ్ రేంజ్ వేరియంట్ కారు అతిపెద్ద 99.8kWh బ్యాటరీ ప్యాక్ తో రాగా, ఈ బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 561 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నట్లు కియా పేర్కొంది. ఈ మోడల్ మొత్తంగా 379bhp మరియు 700Nm టార్కును ఉత్పత్తి చేసేందుకు వీలుగా డ్యూయల్-మోటార్ సెటప్ తో వచ్చింది. ఈ కారును 350kWh డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 24 నిమిషాల్లోనే 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్