- కొత్త కార్నివాల్ మరియు EV9 తర్వాత మూడవ ప్రీమియం కారుగా వస్తున్న EV6ఫేస్‍లిఫ్ట్
- 2024 మే నెలలో వెల్లడి
కియా ఇండియా దాని రెండు ప్రీమియం కార్లను త్వరలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, న్యూ-జెన్ కార్నివాల్ మరియు EV9 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ కార్లను కియా తీసుకువస్తుంది. పైన పేర్కొన్న రెండు కార్లు వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కానుండగా, అలాగే ఆటోమేకర్ మరొక ప్రీమియం ప్రొడక్టుపై వర్క్ చేస్తుంది. ఈ కారు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ఇండియన్ మార్కెట్లో కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ EV6ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ కారు పేటెంట్ ని పొందగా, ఈ కారు కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్ డేటెడ్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మే నెలలో అరంగేట్రం చేయగా, ఇది ట్వీక్ చేయబడిన ఎక్స్‌టీరియర్ డిజైన్, పెద్ద బ్యాటరీ ప్యాక్, మరియు ఇంటీరియర్లో చిన్న చిన్న మార్పులను పొందింది.
కారు ముందు భాగంలో జరిగిన డిజైన్ మార్పులను పరిశీలిస్తే, EV6ఫేస్‍లిఫ్ట్ కారు ట్రయాంగులర్-షేప్ లో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో రీవర్క్ చేయబడిన ఫేసియా మరియు కొత్త ఎయిర్ డ్యాంతో రీఫ్రెష్డ్ బంపర్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, ఇది కొత్త 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్ గేట్ పై ఎల్ఈడీ లైట్ బార్ లో చిన్న చిన్న మార్పులను పొందింది.
ఇంటీరియర్ పరంగా, కియా EV6 కారు లోపల ఆఫ్ సెట్ లోగోతో కొత్త డ్యూయల్-టోన్ స్టీరింగ్ వీల్, 12-ఇంచ్ హెడ్ అప్ డిస్ ప్లే, మరియు డిజిటల్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి అప్ డేట్లను అందుకుంది. కారు బానెట్ కింద, ఇది 77.4kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ ని రీప్లేస్ చేస్తూ అతిపెద్ద 84kWh యూనిట్ అనే బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఈ కొత్త ఇటరేషన్ కి సంబంధించిన అప్ డేటెడ్ రేంజ్ స్పెసిఫికేషన్ల వివరాలను కియా వెల్లడించకపోయినప్పటికీ, ఇది 350kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుండగా, కారును కేవలం 18 నిమిషాల్లోనే 10-80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్