- ఈవీ6, ఈవీ9, ఈవీ5 మరియు ఈవీ4లతో చేరనున్న ఈవీ3
- 2025లో లాంచ్ అవుతున్న ఇండియా-స్పెసిఫిక్ ఈవీ
ఎలక్ట్రిక్ కియా సెల్టోస్ ఆ ? అవును, మీరు చదివింది నిజమే. ఇటీవలి ఈవీ డే 2023లో, కియా ఈవీ3 కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది మరియు దీన్ని ఒక్కసారి చూస్తే ఇది ఆల్-ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యువి ఆధారంగా వచ్చిందని చాలా ఈజీగా చెప్పవచ్చు . కియా ఇప్పటికే 2025 నుండి తమ అనంతపూర్ ప్లాంట్ లో లోకల్ గా తయారయ్యే ఈవీని ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది మరియు ఈ ఎలక్ట్రిక్ సెల్టోస్ ఆధారంగా రానుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.
బయటి వైపు సెల్టోస్ లా ఉందా ?
కియా అధికారికంగా దీనిని కాంపాక్ట్ ఎస్‌యువి అని పేర్కొంది, ఇది కార్ ప్లాట్‌ఫారమ్ నుండి ఉత్పన్నమైన ఎస్‌యూవి కోసం మార్కెటింగ్ గా క్రేజీ ఉంది . దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ హైలైట్‌లలో వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, చంకీవీల్స్ మరియు వెనుక వైపు రూఫ్‌లైన్ స్లోప్ ఉండే సిల్హౌట్ ఉన్నాయి. కియా యొక్క ప్రస్తుత కార్ల మాదిరిగానే వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన లైట్ బార్ మరియు లిప్ స్పాయిలర్‌కు కొంచెం దిగువన షార్ప్ రేక్డ్ గ్లాస్ ఉన్నాయి. మీరు ప్రస్తుత సెల్టోస్ మరియు ఈ కారును బ్యాక్-టు-బ్యాక్ చూస్తే, పాపులర్ ఎస్‌యూవి ఇతర వాటి కన్నా ఎంత ముందు వెళ్లిందో చూడటం సులభం.
మినిమల్ డిజైన్ తో క్యాబిన్
లోపలి భాగంలో ఎక్స్‌టీరియర్ లేఅవుట్ వలె ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ తరంలో సెల్టోస్ ఎక్కడి దాకా అభివృద్ధి పొందుతుందో కూడా సూచిస్తుంది. మీరు డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ క్రింద భారీ స్టోరేజ్ షెల్ఫ్‌ను పొందుతారు. క్యాబిన్ మొత్తం గ్రేతో కలసిన గ్రీన్ కలర్ లో ఉండనుంది. రెండవ వరుసలో హైలైట్స్ ఏంటి అంటే హై ఫ్లోర్, ఫోల్డింగ్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఇద్దరు అడ్జస్ అయ్యేలా విశాలమైన స్పేస్ ఉండనుంది. తర్వాత, కాన్సెప్ట్ రూపంలో హెడ్‌రెస్ట్‌లు చాలా ఫంకీగా కనిపించనున్నాయి , అయితే మేము ప్రొడక్షన్-రెడీ వెర్షన్ చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాము.
హుడ్ కింద ఏమేమి ఉన్నాయో తెలుసా!
దీని పవర్‌ట్రెయిన్‌లు లేదా కొలతల గురించి ఇంకా ఎటువంటి చర్చ లేదు, కానీ ఇది ప్రస్తుత సెల్టోస్‌తో సమానంగా దీనిని భావించవచ్చుమరియు దీనిబ్యాటరీ ప్యాక్ దాదాపు 300-400కిమీ డబ్ల్యూ ఎల్ టిపి రేంజ్ ని అందిస్తుంది. డీల్‌లో భాగంగా ఇది వి2ఎల్, వి2వి మరియు 175kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా అందించే అవకాశం ఉంది. వాస్తవానికి, ఈ వాహనం కారెన్స్ ఎంపివి ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఏవి రాబోతున్నాయో ముందే సూచిస్తుంది. ఒకవేళ లాంచ్ అయితే, ఈఎలక్ట్రిక్ సెల్టోస్ హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయోటా మరియు మారుతి సుజుకి నుండి వచ్చిన ఈవీలతో పోటీ పడవచ్చు.
అనువాదించిన వారు:రాజపుష్ప