- క్లావిస్ సోనెట్ కంటే తక్కువగా వచ్చే అవకాశం
- ఇండియాలో లాంచ్ తర్వాత పంచ్ మరియు ఎక్స్‌టర్‌లతో పోటీగా ఉండనున్న క్లావిస్
కియా క్లావిస్ బి-ఎస్‌యువి పై ఇండియాలో టెస్టింగ్ ప్రారంభించింది, ఈ మోడల్ అంతర్జాతీయ పబ్లిక్ రోడ్ పై టెస్ట్ చేస్తూ గుర్తించబడిన కొద్దిసేపటికే కియా ఇండియాలో క్లావిస్ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది, ఇది లోకల్ మార్కెట్ లో లాంచ్ సమయానికి క్లావిస్ పేరుతో వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ చిత్రంలో చూస్తే, కియా క్లావిస్ టెస్ట్ మ్యూల్ భారీగా కప్పబడి తద్వారా దాని కొత్త రూపంతో చాలా వరకు దాగి ఉన్నాయి. ఈ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నకారులోని కనిపించే అంశాలలో, డ్యూయల్-టోన్ రూఫ్ రెయిల్స్ మరియు అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, బాడీ-కలర్డ్ ఎ మరియు బి-పిల్లర్స్, ఫ్రంట్ మరియు రియర్ మొత్తం నిలువుగా ఉన్న క్వార్టర్ గ్లాసెస్ ఉన్నాయి.
క్లావిస్ బి-ఎస్‌యువి యొక్క మొదటి స్పై షాట్‌లు ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి కొన్ని అంశాలను వెల్లడించాయి.
కొత్త కియా క్లావిస్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఇండియా-స్పెక్ కార్ 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, క్లావిస్, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప