- ఓవరాల్ గా సోనెట్ మరియు సెల్టోస్ మధ్య నిలవనున్న కియా క్లావిస్
- 2024 చివరలో అరంగేట్రం
కొలతల పరంగా కియా క్లావిస్ ఎస్‍యూవీ నాలుగు మీటర్ల లోపల ఉన్నా కానీ, ఇది సోనెట్ మరియు సెల్టోస్ మధ్య కరెక్టుగా పొజిషన్ చేయబడుతుంది. ఇదే కారు లేటెస్టుగా టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది. ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‍యూవీ ఈ సంవత్సరం చివరలో అరంగేట్రం చేయనుండగా, 2025 ప్రారంభంలో దీనిని లాంచ్ చేయడానికి కియా కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
క్లావిస్ కి సంబంధించి కొత్త స్పై ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుండగా, అందులోని కొన్ని ఫోటోలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటిని మేము మీకు చూపించబోతున్నాం. ఈ కారు అంతా కామోఫ్లేజ్ తో కప్పబడి ఉండగా, దీని ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. వీటితో పాటుగా అప్ కమింగ్ ఎస్‍యూవీలోని ఇంటీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.
ఫోటోలో చూసిన విధంగా, కియా క్లావిస్ బాక్సీ సిల్హౌట్ తో నిటారుగా మరియు నిటారుగా ఉన్న లుక్ ని పొందింది. ఇది కొంచెం సోనెట్ లాగా కనిపిస్తున్నా, ఇందులోని కొన్ని డిజైన్ అంశాలను చూస్తే, కారెన్స్ ఎంపివి వలె అనిపిస్తుంది. అయితే, ఇందులో గుర్తించాల్సిన హైలైట్ ఫీచర్లలో నిలువుగా అమర్చినట్లు ఉండే డీఆర్ఎల్స్, పాడ్-స్టైల్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, లో-పేస్ టెయిల్ ల్యాంప్స్, మరియు ఫ్లాట్ టెయిల్ గేట్ తో పెద్ద రియర్ విండ్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. అలాగే, ఇందులో ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, స్క్వేర్డ్ వీల్ అర్చెస్, మరియు చుట్టూ అంతటా చంకీ క్లాడింగ్ వంటివి ఉన్నాయి.
ఇప్పుడు, అంటే మొదటిసారిగా క్లావిస్ ఇంటీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఫోటోలో కనిపిస్తున్న వాటిలో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ తో ట్విన్-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ని పొందింది. ఇంకా, ఇందులో మీడియాను మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ ని కంట్రోల్ చేయడానికి స్టీరింగ్ వీల్ పై కంట్రోల్ బటన్లు కూడా ఉన్నాయి.
కియా క్లావిస్ లో గమనించాల్సిన ఇతర అంశాలలో ఆటో వైపర్స్, స్టీరింగ్ వీల్ పై ఆఫ్-సెంటర్ కియా లోగో, ఇన్ఫోటైన్మెంట్ మరియు డ్రైవర్ డిస్ ప్లే కోసం రెండు డిస్ ప్లేలు, మరియు ఇన్ఫోటైన్మెంట్ కోసం ఫిజికల్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్ గా చూస్తే, కియా సోనెట్ లో ఉపయోగించిన ఒకే విధమైన పవర్ ట్రెయిన్లు కియా క్లావిస్ లో కూడా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండగా, ఇవన్నీ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సు ఆప్షన్లతో రానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్