- ఇండియాలో గత సంవత్సరం ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కార్నివాల్‌ను ప్రదర్శించించిన కియా
- 2024 ప్రారంభంలో న్యూ ఫేస్‌లిఫ్టెడ్ కార్నివాల్ వచ్చే అవకాశం
కియా ఇండియా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే 2024 కార్నివాల్‌ను లాంచ్ చేసే ముందు ఇండియాలో టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించింది. దీని కొత్త స్పై షాట్స్ చూస్తే మొదటిసారిగా ఈ మోడల్ టెస్ట్ మ్యూల్ యూనిట్ అంతటా కప్పబడి కనిపించింది.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ డిఆర్ఎల్ఎస్ కొత్త గ్రిల్ డిజైన్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్, వైడ్ ఎయిర్ డ్యామ్, ఏ-పిల్లర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్, షార్క్-ఫిన్ యాంటెన్నా, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రెయిల్స్ లను కలిగి ఉంది. మిగిలిన చోట్ల, ఇది రీవర్క్ చేయబడిన రియర్ బంపర్, సి-పిల్లర్‌కు సిల్వర్ ఫినిషింగ్ మరియు టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్‌ను పొందవచ్చని మేము భావిస్తున్నాం.
లోపలి భాగంలో, న్యూ కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ సెంటర్ కన్సోల్ డ్రైవర్ సీటు వైపు కొద్దిగా వంగి ఉన్న రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్‌ను పొందే అవకాశం ఉంది. ఈ డ్యాష్‌బోర్డ్‌లో రెండు 12.3-ఇంచ్ స్క్రీన్‌లు ఉంటాయి, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ కన్సోల్ కోసం ఒక్కొక్కటి ఉంటుంది. అంతేకాకుండా, ఇది న్యూ3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఏసీ మరియు టచ్‌స్క్రీన్ ఫంక్షన్‌ల మధ్య చేంజ్ చేయగలిగే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద ప్యానెల్, హెచ్ యూడీ వంటి ఫీచర్లు ఉన్నాయి, దీని రెండవ వరుస సీట్స్ మధ్యలో కూర్చున్న ప్రయాణీకుల కోసం 14.6-ఇంచ్ స్క్రీన్‌లు మరియు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇంకా ఏడీఏఎస్ సూట్ కూడా ఉండే అవకాశం ఉంది.
హుడ్ కింద, అవుట్‌గోయింగ్ వెర్షన్ కారు లాగే ఫేస్‌లిఫ్టెడ్ కియా కార్నివాల్ మోడల్ కూడా పవర్డ్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ని పొందుతుందని భావిస్తున్నాం. ప్రస్తుత-జెన్ కారు యొక్క అవుట్ పుట్ 197bhp మరియు 440Nmతో పోలిస్తే,ఫేస్‌లిఫ్టెడ్ కియా కార్నివాల్ భారీ అప్‌డేట్ ద్వారా 191bhp మరియు 441Nm టార్క్, అవుట్‌పుట్ అందించే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 72 లీటర్లకు పెరగడంతో, 2024 కార్నివాల్ 13 కెఎంపిఎల్ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
అనువాదించిన వారు: రాజపుష్ప