- వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ కానున్న అప్‌డేటెడ్ కియా కార్నివాల్
- ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్
ఫేస్‌లిఫ్టెడ్ కియా కార్నివాల్ మరికొన్ని వారాల్లో జరగబోయే వరల్డ్ లాంచ్ కు ముందే టెస్ట్ మ్యూల్ షీట్ లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రీమియం ఎంపివి ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రదర్శించింది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, రిఫ్రెష్డ్ కియా కార్నివాల్ అప్‌డేట్ చేయబడిన ఫాసియాను పొందింది, ఇందులో క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన కొత్త గ్రిల్, భారతదేశంలో విక్రయించబడుతున్న ప్రస్తుత సెల్టోస్‌కు సమానమైన ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, నిలువుగా అమర్చిబడిన హెడ్‌ల్యాంప్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ మరియు రియర్ సైడ్ ఎల్ఈడీ లైట్ బార్ టైల్‌లైట్స్ తో సుపరిచితమైన డిజైన్‌ను కలిగి ఉంది, ఇదిరాబోయే సోనెట్ కి సమానంగా స్పోర్ట్ లుక్ ని ఇవ్వనుంది . ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మినిమం కర్వ్ షేప్ మరియు లైన్స్ ఉండనున్నాయి. అంతే కాకుండా ఇందులో క్రోమ్ ఇన్‌సర్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
లోపలి భాగంలో, 2024 కియా కార్నివాల్ ఏడిఏఎస్ సూట్, రివైజ్డ్ డ్యాష్‌బోర్డ్, సింగిల్-పీస్ స్క్రీన్ హౌసింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ల రూపంలో సరికొత్త ఫీచర్లను పొందే అవకాశం ఉంది.
క్రింది హుడ్ లో, రాబోయే కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లో ఇంతకు ముందున్న 2.2-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ 200bhp మరియు 400Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వీల్స్ కి పవర్ ని అందజేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప