- వచ్చే సంవత్సరం ఇండియన్ మార్కెట్లో ప్రవేశించనున్న అప్ డేటెడ్ కార్నివాల్
- 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్
ఎన్నో స్పై షాట్స్ మరియు లీక్స్ తర్వాత, కియా ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ ను అధికారికంగా ఆవిష్కరించింది. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఈ కేవలం బ్రాండ్ ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే లీక్ చేసింది, రాబోయే వారాల్లో ఇంటీరియర్ అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
ఫ్రంట్ డిజైన్ ని చూస్తే, కొత్త కియా కార్నివాల్ ఫేస్‌లిఫ్ట్ లోని రివైజ్డ్ ఫాసియాలో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ క్లస్టర్ నుండి రెండు వైపులా సెంటర్ బానెట్ వరకు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, భారీ సైజులో టైగర్-నోస్ గ్రిల్, రీవర్క్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, టెయిల్ గేట్ పై కొత్త ఎల్ఈడీ లైట్ బార్ వంటి వాటిని కలిగి ఉంది.
అలాగే, 2024 కార్నివాల్ లో కొత్త డ్యూయల్-టోన్ వీల్స్ సెట్ కూడా అందించబడింది. అదనంగా ఇంకా చెప్పాలంటే ఇందులో టెయిల్ గేట్ ని తొలగించడమే కాకుండా, ఓల్డ్ ఇటరేషన్ తో పోలిస్తే నెంబర్ ప్లేట్ హోల్డర్ ని కూడా ఇంతకు ముందున్న పొజిషన్ లా కాకుండా కొద్దిగా కింది వైపు అమర్చడం జరిగింది.
ఫేస్‌లిఫ్టెడ్ కార్నివాల్ ఇంటీరియర్ ను మాత్రమే కాకుండా, ఇందులో కీలక స్పెసిఫికేషన్స్ అయిన కొలతలు మరియు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ ని కూడా త్వరలోనే కియా కంపెనీ వెల్లడించనుంది. 2023 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన వెర్షన్ కాకుండా, వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ కార్నివాల్ వెర్షన్ ఇండియాలో అడుగు పెట్టనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్