- అందుబాటులోకి రానున్న పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్స్
- కేవలం ఆటోమేటిక్ వెర్షన్స్ లో మాత్రమే రానున్న ఎక్స్-లైన్ వేరియంట్
తాజాగా కియా ఇండియా ఎక్స్-లైన్ వేరియంట్ లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ ను రూ.18.94 లక్షలు మరియు రూ. 19.45 లక్షలు(అన్నీ ధరలు, ఎక్స్- షోరూం) జత చేసి వేరియంట్స్ లిస్టును అప్ డేట్ చేసింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న టాప్ స్పెక్ వేరియంట్ లో మాత్రమే 6-సీటర్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
కియా కారెన్స్ ఎక్స్-లైన్ వేరియంట్ ను పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్స్ లో 7-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్స్ లో పొందవచ్చు. దీని బయట వైపు చూస్తే, ఈ కొత్త ఎడిషన్ మ్యాట్ గ్రాఫైట్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ తో రానుంది. ఇందులో ఉన్న ఇతర హైలెట్స్ గురించి చెప్పాలంటే, గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్ తో రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఓఆర్‌విఎం, స్కిడ్ ప్లేట్, మరియు సైడ్ డోర్ గార్నిష్ ఉన్నాయి. అదే విధంగా, కారెన్స్ ఎక్స్-లైన్ డ్యూయల్-టోన్ 16-ఇంచ్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ తో రానుంది.
దీని లోపలి భాగాన్ని చూస్తే, కారెన్స్ క్యాబిన్ స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్ మరియు టూ-టోన్ బ్లాక్ అనే రెండు ఇంటీరియర్ థీమ్ ఆప్షన్స్ తో రానుంది. ఇంకా చెప్పాలంటే, లెఫ్ట్-హ్యాండ్ ప్యాసింజర్ కోసం రియర్ సీట్ ఎంటర్ టైన్మెంట్ కూడా కలిగి ఉంది. ఈ పూర్తి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను స్మార్ట్ ఫోన్ యాప్ మరియు స్క్రీన్ మిర్రరింగ్, పాడ్ కాస్ట్స్, మరియు ఇతర ఎంటర్ టైన్మెంట్ యాప్స్ తో కనెక్ట్ చేసి కంట్రోల్ చేయవచ్చు.
మెకానికల్ గా, కారెన్స్ ఎక్స్-లైన్ వేరియంట్ పవర్డ్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. కారెన్స్ లో ఇంతకు ముందున్న వేరియంట్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ జత చేయబడి 158bhp మరియు 253Nm టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. మరోవైపు, 113bhp మరియు 250Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయడానికి దీని ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ తో జత చేయబడి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్