- ఇండియన్ మార్కెట్లోకి ఫిబ్రవరి 2022లో ప్రవేశించిన కారెన్స్
- ఇటీవలే లాంచ్ చేయబడిన ఎక్స్-లైన్ వేరియంట్
ఫిబ్రవరి 2022లో ప్రారంభించినప్పటి నుండి దేశం అంతటా 1,00,000 యూనిట్లను విక్రయించి సరికొత్త మైలురాయిని కారెన్స్ చేరుకున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. అలాగే కియా ఇండియా మారుతి సుజుకి XL6, హ్యుందాయ్ అల్కాజార్, మారుతి సుజుకి ఎర్టిగా మరియు మహీంద్రా మరాజో వంటి వాటికి పోటీగా 7-సీటర్ ఎంపివిని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం, ఈఎంపివి ప్రీమియం,ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ మరియు X-లైన్ అనే 6 వేరియంట్స్ లో అందించబడుతోంది, ఇది 3 పవర్‌ట్రెయిన్స్ మరియు 4 గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. వినియోగదారులు 8 మోనోటోన్ ఎక్స్‌టీరియర్ షేడ్స్ లో కారెన్స్ ను ఎంచుకోవచ్చు. ఇందులో ఇంపీరియల్ బ్లూ, మోస్ బ్రౌన్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ వంటి కలర్స్ ఉన్నాయి.
ఇతర వార్తలలో చూస్తే , కియా ఇండియా కారెన్స్ లైనప్‌లో న్యూ ఎక్స్-లైన్ వేరియంట్‌ను పరిచయం చేసింది. టాప్ పొజిషన్ లో అందుబాటులో ఉన్న ఈ 6-సీటర్ ఎంపివి పెట్రోల్ మరియు డీజిల్ లో లభిస్తుంది. ఈ రెండింటి ధరలు రూ.18.95 లక్షలు నుండి ప్రారంభమైరూ. 19.45 లక్షలు(రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) వరకు ఉండనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప