- ఇంతకు ముందు ఇటరేషన్ టెస్టులో కూడా 3-స్టార్ రేటింగ్ పొందిన కారెన్స్
- స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ తో టెస్ట్ చేయబడ్డ ప్రస్తుత మోడల్
గ్లోబల్ ఎన్‍క్యాప్ ద్వారా తాజాగా నిర్వహించబడిన క్రాష్ టెస్టులో వివిధ మోడల్స్ రిజల్ట్స్ ని రిలీజ్ చేయగా, అందులో మహీంద్రా బొలెరో నియో, కియా కారెన్స్, మరియు హోండా అమేజ్ ఉన్నాయి. గతంలో 2022లో కారెన్స్ మోడల్ ని క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయగా, 3-స్టార్ రేటింగ్ ని పొందింది. ఈ సారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది, కాకపోతే ఈ సారి ఈ టెస్టు అప్‍డేటెడ్ ప్రోటోకాల్స్ ప్రకారం నిర్వహించబడింది.
ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం, కారెన్స్ ని రెండు సార్లు టెస్ట్ చేయగా, మొదటి టెస్టులో ఈ మోడల్ 0-స్టార్ రేటింగ్ తో నిరాశపరిచే రిజల్ట్స్ ని రిజిస్టర్ చేసింది. ఈ టెస్టులో మెడ భాగంలో అధిక ప్రభావాన్ని (హై ఇంపాక్ట్) చూపుతున్నట్లు గుర్తించబడింది. దీంతో కియా దాని రీస్ట్రెయిన్ సిస్టంని మెరుగుపరిచింది. దాని తర్వాత జరిగిన రీటెస్టులో ఈ మోడల్ 3-స్టార్ రేటింగ్ పొందింది.
ఫైనల్ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం, కియా కారెన్స్ అడల్ట్ ఆక్యుపెన్సీలో 34 పాయింట్లకు గాను 22.07 పాయింట్లు స్కోర్ చేసింది, అదే విధంగా చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్లో 49 పాయింట్లకు గాను 41 పాయింట్లు స్కోర్ చేసింది. ఫలితంగా, దీనికి వరుసగా అడల్ట్ ఆక్యుపెన్సీలో 3-స్టార్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 5-స్టార్ రేటింగ్ లభించింది.
కియా కారెన్స్ అస్థిరమైన బాడీ షెల్ ప్రశ్నార్థకంగా మారింది. మున్ముందు మరింత లోడ్ ని తీసుకునే కెపాసిటీ దీనికి లేదు. ఈ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, సీట్ బెస్ట్ ప్రీ-టెన్షనర్స్ మరియు లోడ్ లిమిటర్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, ఈఎస్‍సీ, మరియు ఐసోఫిక్స్ చైల్డ్ యాంకరేజ్ పాయింట్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్