- అక్టోబర్ 1 నుంచి సెల్టోస్ మరియు కారెన్స్ పై ధరలను పెంచిన కియా
- ఇటీవల X లైన్ వెర్షన్ తో అప్ డేట్ చేయబడిన కారెన్స్
సెప్టెంబర్ నెలలో, కియా తమ సెలెక్టెడ్ మోడల్స్ పై, అలాగే కారెన్స్ మరియు సెల్టోస్ తో కలిపి 5 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ముందే చెప్పాము. ఇప్పుడు మేము కారెన్స్ ప్రస్తుత ధరల లిస్టును కలిగి ఉన్నాము. ఈ మోడల్ పై ప్రస్తుతం రూ. 15,000 వరకు పెరిగింది.
ఎంట్రీ లెవెల్ ప్రీమియం 1.5 పెట్రోల్ ఎంటి 7ఎస్, ప్రీమియం 1.5 టర్బో పెట్రోల్ ఐఎంటి 7ఎస్, ప్రెస్టీజ్ 1.5 టర్బో పెట్రోల్ ఐఎంటి 7ఎస్, ప్రీమియం 1.5 డీజిల్ ఐఎంటి 7ఎస్, మరియు లగ్జరీ ప్లస్ 1.5 డీజిల్ ఏటీ 7ఎస్ అనే కారెన్స్ వెర్షన్స్ పై ధరలు ఏ మాత్రం పెరగకుండా అలానే ఉన్నాయి.
ఇవి కాకుండా, ప్రెస్టీజ్ 1.5 పెట్రోల్ ఎంటి 7ఎస్, ప్రెస్టీజ్ ప్లస్ 1.5 టర్బో-పెట్రోల్ ఐఎంటి 7ఎస్, ప్రెస్టీజ్ 1.5 డీజిల్ ఐఎంటి 7ఎస్, మరియు ప్రెస్టీజ్ ప్లస్ 1.5 డీజిల్ ఐఎంటి 7ఎస్ పై రూ. 10,000 వరకు ధరలు పెరిగాయి. అలాగే ప్రెస్టీజ్ ప్లస్ 1.5 టర్బో-పెట్రోల్ డిసిటి 7ఎస్ వెర్షన్స్ పై ఇంతకు ముందున్న ధరతో పోలిస్తే రూ.10,200 వరకు పెరిగింది. ఇంకా మిగతా అన్నీ వెర్షన్స్ పై ఒకే విధంగా రూ.15,000 వరకు ధరలు పెరిగాయి.
ఈ వారం ప్రారంభంలో, కియా ఇండియాలో కారెన్స్ X లైన్ వేరియంట్‌ను లాంచ్ చేయగా, దీని ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోడల్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్స్ వరుసగా 7-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌లతో జత చేయబడి ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్