- మాక్సిమం ధర పెంపును పొందిన X-లైన్ వేరియంట్
- సోనెట్ మరియు సెల్టోస్ ధరలలో కూడా మార్పులు
సోనెట్ మరియు సెల్టోస్ ఎస్‌యువి ధరల అప్‌డేట్ తర్వాత, కియా ఇండియా కారెన్స్ ధరలను కూడా పెంచింది. ముఖ్యంగా, ప్రీమియం (O) వేరియంట్ నుండి ధరలు అప్‌డేట్ కాగా, ఎంట్రీ లెవల్ ప్రీమియం వేరియంట్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీనివల్ల, ఇప్పుడు కారెన్స్ రూ. 10.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతోనే కొనసాగుతుంది.
కియా కారెన్స్ ను ప్రీమియం, ప్రీమియం (O), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్రెస్టీజ్+, ప్రెస్టీజ్+ (O), లగ్జరీ, లగ్జరీ ప్లస్ మరియు X-లైన్ అనే 9 వేరియంట్‌లలో పొందవచ్చు. ధర పెంపు విషయానికొస్తే, ఇప్పుడు ఈ మోడల్ పై పెరిగిన ధర రూ. 8,000 నుండి రూ. 27,000 మధ్య ఉంది. మరోవైపు, డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టాప్-స్పెక్ X-లైన్ మాక్సిమం ధర పెంపును పొందగా, ఇప్పుడు ఈ మోడల్ ధర రూ. 19.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ఇతర వార్తలలో చూస్తే, ఆటో మేకర్ కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ పై పనిని కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా టెస్ట్ చేస్తూ కనిపించింది, ఇటీవలి దీని స్పై చిత్రాలు పూర్తి-వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ చేయబడిన ఫాసియాను వెల్లడించాయి. ఇది 2025 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప