- ప్రస్తుతం అందుబాటులో ఉన్న6 కలర్ ఆప్షన్స్
- ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)
కియా ఇండియా తన కారెన్స్ ఎంపివితో అందించబడిన కలర్ ఆప్షన్స్ కు సంబంధించి ఒక అప్ డేట్ విడుదల చేసింది. ఇక నుంచి ఇందులోని మూడు వరుసల మోడల్ ఇకపై మోస్ బ్రౌన్ ఎక్స్టీరియర్ కలర్ తో అందుబాటులోఉండదు. దీనితో, కారెన్స్ ఇప్పుడు 6 పెయింట్ కలర్స్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అవి ఏవి అంటే, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే మరియు గ్లేసియర్ వైట్ పెర్ల్.
కియా కారెన్స్ రూ.10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ (O), లగ్జరీ ప్లస్ మరియు X-లైన్ అనే - 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండోది ఇటీవల అక్టోబర్‌లో రూ.18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర ట్యాగ్‌లో ప్రవేశపెట్టబడింది.
మెకానికల్‌గా, ఎంపివి మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది – దీనిని 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఎంపివిని 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, 7-స్పీడ్ డిసిటిమరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో సహా వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప