- రూ.12.10 లక్షలతో ధరలు ప్రారంభం
- ప్రీమియం (O) వెర్షన్ కంటేఎక్కువ ఫీచర్లతో లభ్యం
కియా ఇండియా దాని మోడల్స్ లో రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో లభించే సోనెట్, సెల్టోస్ మరియు కారెన్స్ వంటి కార్లలోగ్రావిటీ ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లో ఇటీవలే లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాకుండా, కారెన్స్ ఎంపివి కొత్త స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూం ధర రూ. 12.10 లక్షలతో ప్రారంభంకాగా, ఇది ఇప్పుడు ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
కియా కారెన్స్ గ్రావిటీఎడిషన్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ప్రీమియం (O) వెర్షన్ కంటే బెటర్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ప్రీమియం (O) వేరియంట్ తో పోలిస్తే కారెన్స్ గ్రావిటీ ఎడిషన్ ఫ్రంట్ డోర్‌లపై గ్రావిటీ బ్యాడ్జ్‌ని కలిగి ఉండగా, ఇందులో డాష్ కెమెరా, సన్‌రూఫ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఫాక్స్ లెదర్ సీట్స్, ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ మరియు లెథెరెట్ డోర్ సెంటర్ మరియు ఆర్మ్‌రెస్ట్స్ వంటి అదనపు ఫీచర్లతో ఎన్నో ప్రత్యేక అంశాలు ఉన్నాయి.
క్రింది హుడ్ లో, కారెన్స్ గ్రావిటీ , 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టిజిడిఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే, దీనిలోని టిజిడిఐ పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ ఐఎంటి గేర్‌బాక్స్‌ను కలిగి ఉండగా, మరో రెండు పవర్‌ట్రెయిన్‌లను సాధారణమైన మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పొందవచ్చు.
ఇతర వార్తలలో చూస్తే, కొరియన్ ఆటోమేకర్ కొత్త కార్నివాల్ బుకింగ్‌లను రేపు, అనగా 2024, సెప్టెంబర్ 16వ తేదీన ప్రారంభించనుంది.ఈ కారును కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన కస్టమర్లు డీలర్‌షిప్‌ల వద్ద టోకెన్ అమౌంట్మొత్తం రూ. 2 లక్షలు చెల్లించి ప్రీమియం ఎంపివి ని వారి వారి పేర్లతో బుక్ చేసుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప