- 360-డిగ్రీ కెమెరాను పొందనున్న కారెన్స్ ఫేస్‍లిఫ్ట్
- 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం
వచ్చే సంవత్సరం ప్రారంభంలో కారెన్స్ ఫేస్‍లిఫ్ట్ ని లాంచ్ చేయాలని సౌత్ కొరియన్ బ్రాండ్ కియా కంపెనీ భావిస్తుండగా, దాని కంటే ముందుగా ఇండియాలో కారెన్స్ ఫేస్‍లిఫ్ట్ పై టెస్టింగ్ నిర్వహిస్తుంది. కార్ మేకర్ ప్రస్తుతం 2024లో రెండు ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడానికి వాటిపై ముమ్మరంగా శ్రమిస్తుంది. అందులో న్యూ-జెన్ కార్నివాల్ మరియు EV9 అనే రెండు మోడల్స్ ఉన్నాయి.
ఇక కారెన్స్ ఫేస్‍లిఫ్ట్ విషయానికి వస్తే, కొత్త స్పై షాట్ల ద్వారా మొదటిసారిగా ఈ అప్ డేటెడ్ ఎంపివి ఫాసియాకి సంబంధించి కీలక సమాచారం మనకు వెల్లడవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న కీలక అంశాలలో కొత్త స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్, బానెట్ కింది భాగంలో ఎల్ఈడీ లైట్ బార్, రెండు విశాలమైన ఎయిర్ డ్యాంలు ఉన్నాయి. అలాగే ఇది సింగిల్-పేన్ సన్ రూఫ్, రూఫ్ రెయిల్స్, మరియు కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ సెట్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇంతకు ముందు స్పై షాట్లలో ఇది కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్ సెట్ తో వస్తుందని నిర్దారించబడింది.
ప్రస్తుతం 2025 కారెన్స్ కి సంబంధించిన ఇంటీరియర్ వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. కారుకు ఎటువైపు అయినా బ్లైండ్ స్పాట్ కెమెరా ఉండవచ్చని స్పై షాట్ ద్వారా వెల్లడయింది. ఇంకో విషయం ఏంటి అంటే, లాంచ్ సమయానికి ఈ కారు 360-డిగ్రీ కెమెరాతో రావచ్చని చిన్న క్లూ ద్వారా మనకు అర్థం అవుతుంది. అలాగే ఇందులో వెంటిలేటెడ్ సీట్స్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, మరియు రివైజ్డ్ అప్హోల్స్టరీ కూడా అందించవచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కారెన్స్ కారుతో పోలిస్తే, కొత్త కారెన్స్ ఫేస్‍లిఫ్ట్ లోని పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నాం. కొత్త కారెన్స్ 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డీజిల్ మిల్, 1.5-లీటర్ టర్బో ఇంజిన్లతో రానుంది. అలాగే దీనిని వివిధ గేర్ బాక్సులలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, ఐఎంటి, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్