- మిడ్-స్పెక్ మరియు టాప్-స్పెక్ వేరియంట్లను ఎంచుకోవడానికి ఇష్టపడ్డ 50 శాతానికి పైగా కొనుగోలుదారులు
- మొత్తం సేల్స్ లో 62 శాతం వాటాను కలిగి ఉన్న మాన్యువల్ వేరియంట్లు
సౌత్ కొరియన్ ఆటోమేకర్ కియా ఇండియన్ మార్కెట్లో 1.5 లక్షల కారెన్స్ ఎంపివి కార్లను విక్రయించి అరుదైన రికార్డును, ఘనతను సాధించింది. దేశంలో ఈ కారు మొదటిసారిగా ఫిబ్రవరి-2022లో పరిచయం చేయబడగా, ప్రస్తుతం 9 వేరియంట్లలో రూ. 10.52 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
సేల్స్ గురించి చెప్పాలంటే, 50 శాతానికి పైగా కొనుగోలుదారులు కారెన్స్ కారులోని మిడ్-స్పెక్ మరియు టాప్-స్పెక్ వేరియంట్లను ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు. ఈ వేరియంట్లు సన్ రూఫ్, డ్రైవ్ మోడ్స్, వెంటిలేటెడ్ సీట్స్, కియా కనెక్ట్ టెక్, మరియు మరిన్ని ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, మొత్తం సేల్స్ లో 57 శాతం పెట్రోల్ పవర్ ట్రెయిన్ కార్లు సహాయపడగా, 62 శాతం సేల్స్ ని మాన్యువల్ వెర్షన్లు ఆక్రమించాయి.
ఈ మైల్‍స్టోన్ పై కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, “ప్రతి జర్నీలో వారికి స్టైల్ కి అనుగుణంగా మరియుమనసుకు హాయిని కలుగజేస్తూ ఇండియన్ కస్టమర్లకు కారెన్స్ కారు ఎంతో ఇష్టమైనదిగా మారింది. ఇప్పుడు చూస్తే, మా నెలవారీ డొమెస్టిక్ సేల్స్ లో కారెన్స్ ఎంపివి దాదాపు 15 శాతం వాటాను కలిగి ఉంది. రానున్న సంవత్సరాల్లో దీనికి మరింత ప్రజాదరణ పెరుగుతుందని మేము బలంగా నమ్ముతున్నాము. మా కస్టమర్లకు అందుబాటులోకి అడ్వాన్స్డ్ మరియు బెస్ట్-క్వాలిటీ కార్లను తీసుకురావడానికి మా వంతుగా కృషి చేస్తూనే ఉంటాము. ఎల్లవేళలా మాకు సపోర్ట్ గా ఉన్న కస్టమర్లకు మా కృతజ్ఞతలు.' అని పేర్కొన్నారు.
ఇతర వార్తలలో చూస్తే, కియా ఇండియా ఎలక్ట్రిక్ వెర్షన్ కారెన్స్ ఎంపివిని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఇప్పటికే ఈ మోడల్ యొక్క టెస్ట్ మ్యూల్స్ దేశవ్యాప్తంగా టెస్టింగ్ ని కొనసాగిస్తుండగా, వచ్చే ఏడాది 2025లో ఏ సమయంలోనైన ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్