- దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ప్రీమియం “ఎంజి సెలెక్ట్” డీలర్ షిప్స్ ప్రారంభం
- ఎంజి సెలెక్ట్ రిటైల్ చైన్ కింద ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్స్ విక్రయం
ప్రీమియం కార్ల ద్వారా ఇండియాలో నిలదొక్కుకోవడానికి జెఎస్‍డబ్లూ ఎంజి మోటార్ ఇండియా ఒక కొత్త రిటైల్ చైన్ కాన్సెప్టును తీసుకువచ్చింది. ఇంతకు దాని పేరు ఏంటి అంటే, ఎంజి దానిని “ఎంజి సెలెక్ట్”గా పిలుస్తుంది. కొత్త ప్రీమియం అవుట్ లెట్ల ద్వారా ఆటోమేకర్ దాని రాబోయే (అప్ కమింగ్) ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్స్ ని విక్రయించనుండగా, అందులో హైబ్రిడ్ కార్లు మరియు ఎలక్ట్రిక్ కార్లు వంటివి ఉంటాయి. ఇండియన్ మార్కెట్లో కొనుగోలును మరింత సులభతరం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులతో ముందుకువెళ్తున్నామని, అందులో భాగంగానే “ఎంజి సెలెక్ట్” కాన్సెప్టును తీసుకువచ్చినట్లు జెఎస్‍డబ్లూ ఎంజి మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా పేర్కొన్నారు.
ఈ కాన్సెప్టు సరిగ్గా ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతం మారుతి సుజుకి దాని ప్రోడక్ట్ రేంజ్ ని విభజించి నెక్సా మరియు ఎరీనా అనే రెండు అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తుంది. ఎలా అంటే, ఎరీనా అవుట్ లెట్ల ద్వారా మారుతి ఎంట్రీ-లెవెల్ మోడల్స్ ని మరియు నెక్సా అవుట్ లెట్ల ద్వారా ఇన్విక్టో మరియు ఇతర ప్రీమియం కార్లను విక్రయిస్తుంది. ఇప్పుడు “ఎంజి సెలెక్ట్” కాన్సెప్టు కూడా అచ్చం దీనిని పోలి ఉండనుంది.
ప్రస్తుతం, ఎంజి కంపెనీ ఇండియాలో మొత్తం ఏడు మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో లేటెస్టుగా లాంచ్ అయిన విండ్‍సర్ ఈవీతో పాటుగా కామెట్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS ఈవీ, గ్లోస్టర్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎప్పటిలాగానే స్టాండర్డ్ ఎంజి డీలర్ షిప్స్ ద్వారా విక్రయించబడతాయి.
మొత్తగా చూస్తే, కొత్త ఎంజి సెలెక్ట్ బ్రాండ్ ఎక్కువగా రాబోయే (అప్ కమింగ్) ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేస్తుంది. అందులో ఒకటి సైబర్ స్టర్ కాగా, ఈ కారు మొదటిసారిగా మార్చి-2024లో పబ్లిక్ రోడ్లపై కనిపించింది. ఇంకా చెప్పాలంటే, ఆటోమేకర్ భవిష్యత్తులో హైబ్రిడ్, ప్లగ్-ఇన్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, మరియు ఫుల్లీ-ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్స్ వంటి ఎన్నో ప్రొడక్టులను తీసుకురానుంది. ఈ కొత్త సబ్-బ్రాండ్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ 2025లో విక్రయించబడతాయి. అలాగే, ప్రణాళికలలో భాగంగా ఆటోమేకర్ దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఎంజి సెలెక్ట్ షోరూంలను ప్రారంభించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్