- రూ.18.99 లక్షలతో ధరలు ప్రారంభం
- ఎంట్రీ-లెవల్ వేరియంట్‌పై భారీగా తగ్గిన ధర
జీప్ ఇండియా అత్యంత చవకగా ఉన్న ఎస్యువి, కంపాస్ ధరలను జూన్ 2024లో అప్డేట్ చేసింది. ఈ కొత్త ధరల అప్డేట్ తో, కంపాస్ రేంజ్ ధర రూ. 18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని ఫలితంగా, గతంలోఎంట్రీ-లెవల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 20.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు ఈ మోడల్ పై భారీగా రూ. 1.70 లక్షలు వరకు ధర తగ్గింది.
జీప్ కంపాస్‌ను స్పోర్ట్, లాంగిట్యూడ్, నైట్ ఈగల్, లిమిటెడ్, బ్లాక్ షార్క్ మరియు మోడల్ S అనే 6 వేరియంట్లలో పొందవచ్చు. అలాగే, స్పోర్ట్ వేరియంట్ పై గణనీయంగా ధర తగ్గించబడినప్పటికీ, అన్ని ఇతర వేరియంట్స్ ఫై రూ. 14,000 వరకు ఒకేవిధంగా ధర పెరిగింది.
మెకానికల్‌గా, గత సంవత్సరం పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను నిలిపివేసిన తర్వాత, జీప్ కంపాస్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జత చేయబడింది.
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర |
స్పోర్ట్ | రూ. 18.99 లక్షలు |
లాంగిట్యూడ్ | రూ. 22.33 లక్షలు |
నైట్ ఈగల్ | రూ. 25.18 లక్షలు |
లిమిటెడ్ | రూ. 26.33 లక్షలు |
బ్లాక్ షార్క్ | రూ. 26.83 లక్షలు |
మోడల్ S | రూ. 28.33 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప