- ఇండియాలో 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న జీప్ కంపెనీ
- ప్రత్యేకమైన యాక్సెసరీల ప్యాక్ ను పొందిన స్పెషల్ ఎడిషన్
జీప్ కంపెనీ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా, కార్‌మేకర్ కంపాస్ ఎస్‌యువిలో లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ వేరియంట్‌ను యానివర్సరీ ఎడిషన్ అని పిలుస్తుండగా,ఇది ప్రత్యేకమైన యాక్సెసరీల సెట్‌ను పొందింది. ఇప్పుడు జీప్ ఇండియా దాని వెబ్‌సైట్ ద్వారా మరియు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక డీలర్‌షిప్‌ల వద్ద ఈ వేరియంట్‌ను బుకింగ్ చేసువడానికి కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. అయితే, 2024 జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని టాప్-5 హైలైట్స్ ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి వివరాలను పరిశీలిద్దాం.
గ్రిల్ యాక్సెంట్
ముందుగా ఈ కారు ఫేసియా వివరాలు చూస్తే, ఎస్‌యువి వెల్వెట్ రెడ్‌లో ఫ్రంట్ గ్రిల్ ఎంబెల్లిషర్‌ను పొందింది. ఇది కార్‌మేకర్ సిగ్నేచర్ సెవెన్-స్లాట్ గ్రిల్‌లోని రెండవ స్లాట్‌లో వ్యూహాత్మకంగా చేయబడింది.
హుడ్ డెకాల్
రెడ్ కలర్ థీమ్‌కు అనుగుణంగా, ఎస్‌యువి హుడ్ 'యానివర్సరీ ఎడిషన్' బ్యాడ్జ్‌తో విభిన్న బ్లాక్ మరియు రెడ్ స్టిక్కర్‌తో మ్యాచింగ్ డెకాల్‌ను పొందింది.
రెడ్ సీట్స్
దీని రెడ్ కలర్ థీమ్‌ను మరింత మెరుగుపరచడానికి, కార్‌మేకర్ ప్రత్యేకతను జోడిస్తూ ఈ వేరియంట్లో డైనమిక్ వెల్వెట్ రెడ్ సీట్ కవర్‌లతో సీట్లను అందించింది.
డాష్‌క్యామ్
కస్టమర్‌లు దీనిని ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్‌తో కూడిన కొన్ని అదనపు యాక్సెసరీస్ లతో కూడా ఎంచుకోవచ్చు. ఈ కారులో దీనికి తగిన ముఖ్యమైన యాక్సెసరీలను కలిగి ఉండగా, వీటిని యానివర్సరీ ఎడిషన్‌తో అందిస్తుంది.
కొత్త యాంబియంట్ లైటింగ్
అంతేకాకుండా, స్పెషల్ ఎడిషన్ కొత్త వైట్ -కలర్ యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందింది.
పవర్‌ట్రెయిన్
పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికే ఉన్న ఇంజిన్ లైనప్‌తో కంపాస్ యానివర్సరీ ఎడిషన్ అందించబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప