- ఎక్స్‌క్లూజివ్ యాక్సెసరీలను పొందిన స్పెషల్ ఎడిషన్
- ప్రత్యేకంగా ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పై రెడ్ ఇన్సర్ట్స్
జీప్ ఇండియా కంపెనీ దాని 8వ వార్షికోత్సవాన్ని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు, ఈ వేడుకను మరింత స్పెషల్ గా మార్చేందుకు కంపాస్ ఎస్‍యూవీలో “యానివర్సరీ ఎడిషన్”ని తీసుకువచ్చింది. కొత్త ఎడిషన్ ద్వారా, జీప్ కంపాస్ ఎడిషన్ కారు ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా బయట, లోపల కాస్మోటిక్ అప్ గ్రేడ్లతో ఎక్స్‌క్లూజివ్ యాక్సెసరీస్ సెట్ ని పొందింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ కారు బయట వైపు చూస్తే, కొత్తగా గ్రిల్ లోపల మరియు హుడ్ డీకాల్ పై వెల్వెట్ రెడ్ ఇన్సర్ట్ లను కలిగి ఉంది. ఇవి కారుకు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. లోపల, సీట్ అప్ హోల్స్టరీతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డ్యాష్ క్యామ్ రెడ్ కలర్ ట్రీట్మెంట్ తో ఉండడం మీరు చూడవచ్చు. కంపాస్ యానివర్సరీ ఎడిషన్లో అందించబడిన కొత్త అంశాలలో వైట్ యాంబియంట్ లైటింగ్ దీనిని మరింత ఆకట్టుకునే విధంగా మార్చింది.
ఒకవేళ మీరు ఈ కంపాస్ స్పెషల్ ఎడిషన్ కారును బుక్ చేసుకోవాలనుకుంటే, మీకు దగ్గరలో ఉన్న జీప్-అధికారిక షోరూంని లేదా వెబ్ పోర్టల్ ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు. మెకానికల్ గా, మిడ్-సైజ్ ఎస్‍యూవీ కారులోని పవర్ ట్రెయిన్లకు ఆటోమేకర్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అదే విధంగా ఈ కారులో పవర్ ట్రెయిన్లను మనం చూడవచ్చు. కంపాస్ రేంజ్ ఎక్స్-షోరూం ధరలు రూ.18.99 లక్షలతో ప్రారంభం కాగా, వీటిపై సుమారు రూ.3.15 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్