- ఇండియాలో 2021 మార్చి లో లాంచ్ అయిన మోడల్
- చివరిగా విక్రయించబడిన ధర రూ. 1.25 కోట్లు
జాగ్వార్ ఇండియా I-పేస్‌ను దాని అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించగా, ఇండియాలో 2021 మార్చిలో లాంచ్ అయిన ఈ మోడల్ దాని మొదటి ఈవీకి స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తుంది . అలాగే, లిస్టు నుంచి ఈ మోడల్ ని తొలగించకముందు ఒకే ఒక్క HSE వేరియంట్‌లో మాత్రమే అందించబడగా,ఈ కారు రూ.1.25 కోట్ల ధరతో విక్రయించబడింది.
బానెట్ కింద, జాగ్వార్ i-పేస్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడిన 90kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఈ మోటార్ 389bhp మరియు 696Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ మోడల్ లోని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్‍టిపి-రేటెడ్) క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, I-పేస్ లో అన్ని ఎల్ఈడీ లైటింగ్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, సరౌండ్-వ్యూ కెమెరా, ఏసీ కంట్రోల్స్ కోసం టచ్‌స్క్రీన్ యూనిట్, లెదర్ స్పోర్ట్ సీట్స్, మరియు మెరిడియన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప