- మొదటి రెండు ఈవీ మోడల్స్ లోకల్ గా ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తి చేసినవే
- కాంపీటీషన్లో ఇదే మొదటి 3-వరుసల ఈవీ అయ్యే అవకాశం
అధికారిక ప్రకటన
ఇప్పుడు కియా కంపెనీ కారెన్స్ ఈవీ ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా ఎప్పుడు రానుందనే అంశాన్ని చెప్పేసింది. ఎప్పుడంటే వచ్చే సంవత్సరం అనగా 2025లో ఇండియాలో అడుగుపెట్టనుంది. సౌత్ కొరియన్ ఆటోమేకర్ నుంచి లోకల్ గా ఉత్పత్తి చేయబడి వస్తున్న మొదటి ఈవీ కాగా, ఇది ఇండియా నుండి ఇతర లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మరియు రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది. సెగ్మెంట్ మరియు బాడీ స్టైల్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, ఇది రెండవ ఈవీగా అందించబడుతుంది, ఇంకా దాని వివరాలు ఏవీ వెల్లడించబడలేదు కానీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ఎస్‍యూవీ అయి ఉండవచ్చు.
కియా కారెన్స్ ఈవీ రేంజ్ మరియు ఫీచర్లు
కియా కారెన్స్ ఈవీ సుమారు 500-600 కిలోమీటర్ల ఐడియల్ రేంజ్ అందించవచ్చని భావిస్తున్నాం. కారెన్స్ ఐసీఈ వెర్షన్ లాగా కాకుండా, ఈ ఈవీ వెర్షన్ మరీ అంతగా ఎక్కువ వేరియంట్లలో కాకుండా తక్కువ వేరియంట్లలో మరిన్ని ఫీచర్లతో టాప్-స్పెక్ మోడల్స్ లో అందించబడనుంది. దీని ఫీచర్ లిస్టులో డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు, వెంటిలేషన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, లెవెల్-2 ఏడీఏఎస్ మరియు ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి. ఒకవేళ మీరు EV9ని చూస్తే, మొదటిసారిగా ఇది 3-వరుసల ఈవీగా రానుంది. కియా ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ఈవీతో పోలిస్తే, ఇది 6 మరియు 7-సీట్ ఆప్షన్లలో రానుంది.
అంచనా ధర మరియు పోటీ
కారెన్స్ ఐసీఈ రేంజ్ ధర దాదాపు రూ.20 లక్షలు ఉండగా, రేంజ్ ని బట్టి కారెన్స్ ఈవీ ధర రూ.22 లక్షల నుండి రూ.26 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నాం. అలాగే ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ, మహీంద్రా XUV.e8, మారుతి eVX మరియు టయోటా అర్బన్ ఎస్‍యూవీ కాన్సెప్ట్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్