- 2025లో ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం
- ఇది ప్రస్తుతం ఇండియాలో బ్రాండ్ తరపున అందించబడుతున్న ఏకైక మోడల్
ఈ వారం ప్రారంభంలో, బిఎన్ క్యాప్ టాటా పంచ్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ ను ప్రకటించింది, ఈ రెండూ కార్లు కూడా5-స్టార్ రేటింగ్‌స్కోర్ చేయగా, క్రాష్ టెస్ట్చూపించిన వీడియోలలో ఒకదానిలో, నిసాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మాత్రం ఎటువంటి కామోఫ్లేజ్ తో కప్పబడకుండా టెస్ట్ చేయబడింది.
ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, నిసాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కొంతవరకు కవర్ చేసి ఉన్నపటికీ, ప్రస్తుతంఇండియాలో ఈ బ్రాండ్ తరపున మనకు అందించబడుతున్నఏకైక మోడల్ గా నిలిచింది. అలాగే, ముందు భాగంలో, ఈసబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి ట్వీక్డ్ బంపర్, మార్పులు చేసిన (రివైజ్డ్) గ్రిల్ డిజైన్ మరియు న్యూ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను పొందుతుంది. అలాగే ఇది న్యూ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌లైట్స్ మరియు రియర్ బంపర్‌లో మార్పులను కూడా పొందే అవకాశం ఉంది.
ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ ఇంటీరియర్‌లో మార్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేనప్పటికీ, ఇది కొత్త అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ మరియు మరిన్నింటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
మాగ్నైట్ ప్రస్తుత ఇటరేషన్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జ్డ్ రూపాల్లో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ మరియు సీవీటీ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి అందించబడింది. అలాగే, వీటిలో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించాలని నిసాన్ కంపెనీ భావిస్తుంది. లాంచ్ అయిన తర్వాత, 2025 మాగ్నైట్ రెనాల్ట్ కైగర్, మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV 3XO వంటి వాటికి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప