- 2025లో లాంచ్ అయ్యే అవకాశం
- రిఫ్రెష్ అవతార్‌లో అరంగేట్రం చేయనున్న మోడల్
వెబ్‌లో కియా కారెన్స్ కొత్త స్పై షాట్‌లు కనిపించడంతో, ఇదిమునుపటి అప్‌డేట్ కంటే మరింత మోడరన్ లుక్ తో రానుందని అర్థం అవుతుంది. దీని స్పై చిత్రాలు చాలా తక్కువ వివరాలను వెల్లడిస్తున్నాయి, అందువల్ల ఇది EV వెర్షన్ లో వస్తుందాలేదా మూడు-వరుసల ఎంపివి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనే వివరాలు తెలియదు.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, కియా కారెన్స్ టెస్ట్ మ్యూల్ సర్దుబాటు చేయబడిన టెయిల్‌లైట్ డిజైన్‌ను వెల్లడిస్తుంది. ఈ కారు వెనుక ప్రొఫైల్‌ని చూస్తే, ట్వీక్ చేయబడిన టెయిల్‌లైట్ డిజైన్‌ను కూడా చూడవచ్చు. అలాగే , ఇక్కడ కనిపించిన అంశాలను కూడా కలిగి ఉంది. టెయిల్‌గేట్ కూడా చిన్నచిన్న డిజైన్ మార్పులను పొందింది, అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న ఈ కారులో సమానంగా ఉండే ప్లేస్‌మెంట్‌కు విరుద్ధంగా ఉండగా, క్రింది భాగంలో చివరన ఉన్న రిఫ్లెక్టర్స్ ఇప్పుడు నిలువుగా అమర్చబడ్డాయి.
న్యూ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు రీవర్క్ చేసిన హెడ్‌ల్యాంప్స్ వంటి అంశాలతో సహా, అప్‌డేట్ చేయబడిన కారెన్స్ రివైజ్డ్ ఫాసియాని కూడా అందుకుంటుందని మేము భావిస్తున్నాము. న్యూ అల్లాయ్ వీల్స్ సెట్ కూడా ఇందులో అందించే అవకాశం ఉంది.
కారెన్స్ , దాని ఐసిఇ రూపంలో, ప్రస్తుత పవర్‌ట్రెయిన్‌ల రేంజ్ ని 2025 వెర్షన్లో కూడా కొనసాగించవచ్చు. మరోవైపు, ఎలక్ట్రిక్ డెరివేటివ్ లో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 600కిమీల రేంజ్ ని అందించే బ్యాటరీ ప్యాక్‌ని పొందవచ్చు. ఈ కారు EV-స్పెసిఫిక్ కాస్మెటిక్ మార్పులు మరియు ఫీచర్ లిస్ట్ లో మార్పులను పొందుతుంది, వీటి వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప