- వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం
- కారెన్స్ఈవీ తర్వాత వచ్చే అవకాశం
ఇటీవలే ఇంటర్నెట్లో కొత్త స్పై షాట్‌లు దర్శనమివ్వగా, ఇవి కియా సోనెట్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి ఎలక్ట్రిక్ డెరివేటివ్ కి సంబంధించినవిగా స్పై షాట్స్ వెల్లడిస్తున్నాయి. భారీగా కామోఫ్లేజ్ తో కప్పబడినటెస్ట్ మ్యూల్ కియా ప్రణాళికలలో భాగంగా కారెన్స్ ఈవీ తర్వాత వచ్చే అవకాశం ఉంది. కియా సోనెట్ ఈవీ నెక్సాన్ ఈవీకి పోటీగా ఉండేందుకు కియా దీనిని తీసుకువస్తుంది.
కియా సోనెట్ ఈవీ, ఈ ఏడాది జనవరి నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే, ఇది బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ కొత్త పెయింట్ ఆప్షన్స్ వంటి వాటితో ఈవీ-స్పెసిఫిక్ మార్పులను పొందవచ్చని అంచనా.
మాకు అందిన సమాచారం ప్రకారం చూస్తే, సోనెట్ ఈవీ టెస్ట్ మ్యూల్ ఎగ్జాస్ట్ ను పొందలేదు. అలాగే, ఇంజన్ సౌండ్ కూడా లేదు. కారు లోపలి భాగంలో కూడా చిన్న చిన్న మార్పులు పొందవచ్చు, వాటి వివరాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.
కియా ఇండియా ప్రస్తుతం లోకల్ మార్కెట్‌లో EV6 మరియు ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన EV9 అనే రెండు ఈవీలను విక్రయిస్తోంది. కియా సేల్స్ లో కారెన్స్ ఈవీ కూడా వచ్చే ఏడాది ప్రారంభంలో చేరుతుంది. అలాగే, దాని తర్వాత ఎలక్ట్రిక్ సోనెట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కారు ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడిన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే, సుమారు 400కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప