- కారెన్స్ తర్వాత ఇండియాలో బ్రాండ్ నుంచి అందించబడుతున్న రెండవ ఎలక్ట్రిక్ కారు ఇదే.
- ఇది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రదర్శన
కియా దాని కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ EV3ని ఈ నెల 23న అంతర్జాతీయంగా లాంచ్ చేయబోతోంది. కియా కంపెనీ సెల్టోస్ లాగా కనిపించే ఈ మోడల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. చాలా మంది ఇది సెల్టోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ కావచ్చని కూడా నమ్మే అవకాశం ఉంది, కానిదీని పేరు EV3గా మార్చబడింది. ఏది ఏమైనా, కారెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ ఇటీవల నిర్దారించగా, కారెన్స్ తర్వాత ఇండియాలో బ్రాండ్ నుంచి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ కారు ఇదే అవుతుంది. ప్రస్తుతానికి మనం ఈ ఆర్టికల్‌లో EV3 ఫోటోల గురించి చర్చించబోతున్నాం.
EV3 డిజైన్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయి?
గత ఏడాది అక్టోబర్‌లో కాన్సెప్ట్ రూపంలో EV3 ప్రదర్శించబడింది. దీని పొడవు మరియు వెడల్పు సెల్టోస్ లాగా ఉంటాయి. ముందు నుండి ఇది సెల్టోస్ యొక్క ఐసీఈ వెర్షన్ లాగా కనిపిస్తుంది. అలాగే, EV3లో బాక్సీ రియర్ ఫెండర్లు మరియు సిగ్నేచర్ స్టార్ మ్యాప్ లైటింగ్‌తో టెయిల్‌గేట్ ఉన్నాయి, ఇది ఇతర కార్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఎస్‍యూవీ EV9 కాన్సెప్ట్‌పై రూపొందించబడింది.
కంపెనీ రిలీజ్ చేసిన ఫోటోల ప్రకారం చెప్పాలంటే, హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌ల్యాంప్‌లు మాత్రమే ఇక్కడ చూపించబడ్డాయి. ఎల్ఈడీహెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు EV3లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా, ఇది డ్యూయల్ టోన్ కలర్ లో కూడా అందించబడుతుంది. అలాగే, దీని మొత్తం డిజైన్‌లో బ్లాక్ ఇన్సర్ట్‌లు ఉపయోగించబడ్డాయి.
EV3 ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
EV3ని కంపెనీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో మాత్రమే పరిచయం చేయనుంది. అయితే, ఇది అంతర్జాతీయంగా అందించబడుతుంది. అదే విధంగా, త్వరలో ఇండియాలో కూడా అరంగేట్రం చేయవచ్చని మేము భావిస్తున్నాము. అయితే, దీనిని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడం గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్