- రూ. 9.99 లక్షలతో ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర ప్రారంభం
- కిలోమీటరుకు బ్యాటరీ అద్దె రూ. 3.5 రూపాయలు మాత్రమే
విండ్‍సర్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుండి ప్రారంభం కాగా, 4.3-మీటర్ల పొడవైన ఎస్‌యువి, అది కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. అలాగే, విండ్‍సర్ ఈవీ లాంచ్ అయినప్పటి నుండి ఎక్కడ చూసినా వార్తల్లో కనిపిస్తుంది. అయినప్పటికీ, తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో, క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ కారును గూర్చి సరైన వివరణ చాలా అవసరం కాబట్టి ఈ కథనంలో, కొత్త ఎంజి విండ్‍సర్ ఈవీని కొనుగోలు చేసే ముందు దాని ధర గురించి మరియు బ్యాటరీని గురించి మీరు తెలుసుకోవలసిన అంశాలను మేము లిస్ట్ చేసాము.
విండ్‍సర్ ఈవీ అనేది ఒకేఒక్క 38kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడిన ఆల్-ఎలక్ట్రిక్ సీయూవీ. ఇది 331 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఇది ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందించబడింది.
మీరు మొత్తం ఎంత డబ్బును చెల్లించాలి?
బేస్ వేరియంట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఎంజి విండ్‍సర్ ఈవీ కారు ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. అలాగే, ఇందులో BaaS (బ్యాటరీ ఒక సర్వీసు) కూడా ఉంది. ఈ ప్రోగ్రాం కింద, విండ్‍సర్ ఈవీని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, ప్రతి నెలా కనీస ఛార్జీ రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.
ఆటోమేకర్ ప్రారంభ కొనుగోలు ధరను తగ్గించడానికి మరియు కస్టమర్ బేస్‌కు అందుబాటులో ఉండేలా చేయడానికి మీరు బ్యాటరీని విడిగా విక్రయిస్తుంది. ఒకసారి మీరే ఊహించుకోండి, స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నట్లయితే దాని బ్యాటరీని విడిగా కొనుగోలు ఎలా చేస్తారో అలా అన్నమాట. BaaS (బ్యాటరీ ఒక సర్వీసు) కూడా సరిగ్గా ఇలాగే పని చేస్తుంది.
ఒకవేళ మీ బేస్ యూసేజ్ నెలకు 1,500 కిలోమీటర్లు వరకు అయితే, మీరు ఉపయోగించడానికి చెల్లించవలసిన ఛార్జీలు నెలకు రూ.5,250. సంవత్సరానికి విండ్‍సర్ ఈవీ బ్యాటరీ అద్దె ఖర్చు రూ. 63,000, మీరు నెలకు 1,500 కిలోమీటర్లు కంటే ఎక్కువ ఈవీని ఉపయోగిస్తే, ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి, అదనపు ప్రతి కిలోమీటరుకు ఈ చార్జీలు రూ.3.5 ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, మీరు ఈవీని 1,500 కిలోమీటర్లు కంటే తక్కువ ఉపయోగించినా సరే, మీరు నెలకు రూ. 5,250 మీరు చెల్లించవలసి ఉంటుంది. కొన్ని ఫైనాన్స్ ప్రొవైడర్లు కిలోమీటర్లపై పరిమితిని కలిగి ఉండరు, వినియోగదారులు ఈవీని ఉపయోగిస్తే బ్యాటరీ అద్దెను మాత్రమే చెల్లించడానికి అనుమతిస్తారు.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది మెయింటెనెన్స్ మరియు ఛార్జింగ్ వంటి ఇతర ఛార్జీలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, డిసెంబర్ 31లోపు ఈవీని బుక్ చేసుకునే కస్టమర్‌లకు ఒక సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్ కూడా లభిస్తుంది.
కనీస దూరానికి ఛార్జ్ | 1,500 కిలోమీటర్లు |
ఛార్జీలు | రూ. 3.5/కిలోమీటర్ |
నెలవారీ బ్యాటరీ అద్దె ఖర్చు | రూ. 5,250 |
సంవత్సరానికి బ్యాటరీ అద్దె ఖర్చు | రూ. 63,000 |
అయితే, కస్టమర్‌లు ఈఎంఐ ప్లాన్‌కు బదులుగా కారు మరియు బ్యాటరీ కోసం మాత్రమే డబ్బును చెల్లించే ఆప్షన్ ని పొందవచ్చు. అలాగే, కొత్తవిండ్ సర్ ఈవీ షోరూం వద్ద మీకు ధరను వెల్లడించే సమయంలో అన్ని వేరియంట్‌ల ధర మరియు కారు మొత్తం ఖర్చు కూడా వెల్లడించబడుతుంది. ప్రస్తుతం, ఇందులో బ్యాటరీ ధరను చేర్చడంతో, విండ్‍సర్ ఈవీ బేస్ వేరియంట్ ధర రూ. 14 లక్షలు (సుమారు)గా ఉంది.
బ్యాటరీ అద్దెను ఎలా చెల్లించాలి?
ప్రస్తుతం, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మరియు హీరో ఫిన్‌కార్ప్‌తో సహా కొన్ని ఫైనాన్స్ ప్రొవైడర్లు BaaS (బ్యాటరీ ఒక సర్వీసు) సౌకర్యాన్ని అందించడానికి ఎంజి కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఫైనాన్సింగ్ ఆప్షన్‌లలో ఫైనాన్స్ ప్రొవైడర్‌పై ఆధారపడి వివిధ నిబంధనలు మరియు వడ్డీ రేట్లతో ఈఎంఐ ప్లాన్‌లు మారుతూ ఉంటాయి. అలాగే, దీని సమయం పూర్తయ్యేలోపు BaaS (బ్యాటరీ ఒక సర్వీసు) ప్రోగ్రామ్‌ను ఫోర్‌క్లోజ్ చేయడానికి లేదా నిష్క్రమించడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.
ఒకవేళ మీరు ఎంజి విండ్‍సర్ ఈవీని అమ్మాలి అని అనుకుంటే ఏమి చేయాలి?
ఈ కండీషన్లో , అద్దెకు తీసుకున్న బ్యాటరీ గడువు ముగుస్తుంది. అలాగే, మీరు ఈవీ కారును బ్యాటరీ ధరతో సహా బకాయి మొత్తాన్ని పొందవచ్చు. రెండవ యజమాని విండ్‍సర్ ఈవీని బ్యాటరీతో మొత్తంగా లేదా కారుని మాత్రమే కొనుగోలు చేస్తే, ఈవీని కొనుగోలు చేసినందుకు ఆటోమేకర్‌కు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
కారుముగింపు దశకు చేరుకుందని ఎంజి కంపెనీ ఎలా నిర్ణయిస్తుంది?
స్పష్టంగా చెప్పాలంటే, ఫైనాన్స్ సర్వీస్ ప్రొవైడర్ విండ్ సర్ ఈవీ కారులో టెలిమాటిక్స్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేస్తారు, ఇది కిలోమీటర్లు మరియు నెలవారీ అద్దె చెల్లింపులను ట్రాక్ చేయడానికి ఫైనాన్సర్‌కు రియల్- టైం కిలోమీటర్ డేటా యాక్సెస్ ను అందిస్తుంది.
(సెకండ్ ఓనెర్) రెండవ యజమాని పేరుతో ఈ కారు వారంటీని మార్చవచ్చా ?
ఎంజి విండ్‍సర్ ఈవీ కారు లైఫ్ టైం వారంటీని కలిగి ఉంది మరియు కారు బ్యాటరీపై మీరు మూడు సంవత్సరాల వారంటీని పొందవచ్చు. అదే విధంగా, రెండవ యజమానికి లైఫ్ టైం వారంటీ ఉండదు మరియు దీనికి బదులుగా స్టాండర్డ్ గా మీరు 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీని పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప