- జిఎక్స్ వేరియంట్ అధారంగా వస్తున్న ఇన్నోవా హైక్రాస్
- 7 మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్స్ లో లభ్యం
టయోటా కిర్లోస్కర్ మోటార్స్(టికెఎం) తన ఫ్లాగ్‌షిప్ ఎంపివి అయినఇన్నోవా హైక్రాస్ GX లిమిటెడ్ ఎడిషన్‌ను సరైన సమయంలో లాంచ్ చేసింది. GX వేరియంట్ ఆధారంగా, ఈ స్పెషల్ ఎడిషన్ ప్రీమియంను 7 మరియు 8-సీట్స్ కాన్ఫిగరేషన్స్ లో స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే రూ. 40,000 అదనంగా చెల్లించి పొందవచ్చు. హైక్రాస్ GX లిమిటెడ్ ఎడిషన్ ధరలు రూ. 20.07 లక్షల నుండి రూ. 20.22 లక్షలు (రెండింటి ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనున్నాయి.
ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎంపివిలో ఫ్రంట్ గ్రిల్ పై క్రోమ్ గార్నిష్ మరియు ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ పై సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ వంటి ఫీచర్స్ హైలైట్ గా ఉండనున్నాయి. అంతే కాకుండా, ఇది GX వేరియంట్ లాగానే ఉంటుంది. విఎక్స్ వేరియంట్ లోపల సాఫ్ట్-టచ్ చెస్ట్ నట్ బ్రౌన్-ఫినిష్డ్ డ్యాష్ బోర్డ్ మరియు డోర్ ట్రిమ్స్, బ్లాక్ అండ్ బ్రౌన్ డ్యూయల్-టోన్ సీట్ అప్హోల్స్టరీ స్టాండర్డ్‌గా రానున్నాయి. అలాగే పవర్ విండో కంట్రోల్స్ చుట్టూ ఫాక్స్ వుడ్ ట్రిమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
హుడ్ క్రింద, ఇన్నోవా హైక్రాస్ GX లిమిటెడ్ ఎడిషన్ ఒకే ఒక్క 2.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతుంది. అలాగే ఇందులోని మోటార్ 172bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేయడానికి వీలుగా సివిటి యూనిట్ తో జత చేయబడి ఉంది. ఈ ఇన్నోవా హైక్రాస్ GX లిమిటెడ్ ఎడిషన్ కు సంబంధించి మరిన్ని పూర్తి వివరాల కోసం మా కార్‌వాలే వెబ్ సైట్ ను తప్పక సందర్శించండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్