- జపాన్ లో లాంచ్ కాబోతున్న రెండవ ఇండియా-మేడ్ కారు
- 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్న మారుతి ఫ్రాంక్స్
సుజుకి స్వదేశానికి పయనమవుతుంది. ఎలా అంటే, ఇండియా-మేడ్ మారుతి ఫ్రాంక్స్ ని సుజుకి జపాన్ లో లాంచ్ చేయనుంది. ఇండో-జపనీస్ ఆటోమేకర్ దాని గుజరాత్ ప్లాంటులో తయారైన చాలా కార్లను జపాన్ మార్కెట్లో విక్రయించడానికి ఎన్నో కార్లను తరలిస్తుంది. ఇప్పుడు ఇండియా గ్లోబల్ ఫ్రాంక్స్ హబ్ గా మారిపోయింది. 2024 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి ఆటోమేకర్ నుంచి వచ్చిన కారుకు స్థిరంగా దేశీయ డిమాండ్ ఉంది. దీనికి అదనంగా రైట్ హ్యాండ్ డ్రైవ్ మరియు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు కూడా ఆటోమేకర్ ఇండియాలోనే ఈ కారును తయారుచేస్తుంది.
నిజానికి జపనీస్-స్పెక్ కారులో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్, అదే విధంగా ఫీచర్ లిస్టు కూడా ఒకేలా ఉంది. ఇందులో పెద్ద తేడా ఏంటి అంటే, ఇండియాలో విక్రయించబడుతున్న ఫ్రాంక్స్ కారులో అందించిన 1.2-లీటర్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ స్థానంలో జపాన్ లో లాంచ్ కాబోయే ఫ్రాంక్స్ కారులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని మారుతి సుజుకి తీసుకువస్తుంది. 103bhp/138Nm టార్కును ఉత్పత్తి చేసే ఇదే ఇంజిన్ ని ఇండియాలో ఎర్టిగా మరియు బ్రెజా వంటి కార్లలో మారుతి సుజుకి అందించింది. ఇండియాలో ఈ ఇంజిన్ ని 5-స్పీడ్ ఎంటి లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో పొందవచ్చు. అలాగే జపాన్ లో లాంచ్ అయ్యే ఇండియా-మేడ్ ఫ్రాంక్స్ కారులో కేవలం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ని మాత్రమే మారుతి సుజుకి అందించనుంది. ఇంకా చెప్పాలంటే, జపనీస్ మార్కెట్ ఫోర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ని పొందనుంది.
మొదట సుజుకి 2016లో బాలెనో కార్లను ఇండియా నుంచి జపాన్ కి ఎగుమతి చేయడం ప్రారంభించగా, ఫ్రాంక్స్ కారుదాని గ్లోబల్ లాంచ్ తర్వాత దీనిని ఫాలో అవ్వడం లాజికల్ గా అనిపిస్తుంది. గ్లోబల్ గా ఎగుమతి అయిన ఇదే రకమైన స్పెక్ 1.5 ఫ్రాంక్స్ మోడల్ గల్ఫ్ దేశాల్లో మరియు సౌత్ ఆఫ్రికాలో విక్రయించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్