- ప్రస్తుతం రూ.33.43 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం
- అందుబాటులో ఉన్న రెండు పవర్ట్రెయిన్స్
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ దాని 7-సీటర్ ఎస్యువి, ఫార్చూనర్ ధరలను పెంచింది, పెరిగిన ధరలు ఈ క్షణం నుంచే అమలులోకి రానున్నాయి. ఫలితంగా, ఇప్పుడు ఈ మోడల్ పై ధర రూ.70,000 వరకు పెరగడంతో, దీని ధర రూ.33.43 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభంకానుంది.
ఎస్యువిపై వేరియంట్ వారీగా అప్ డేటెడ్ ధరల వివరాలను కింది టేబుల్ లో చూడవచ్చు:
వేరియంట్ | కొత్త ఎక్స్-షోరూం ధర | పెరిగిన ధర |
4x2 ఎంటి పెట్రోల్ | రూ. 33,43,000 | రూ. 44,000 |
4x2 ఎటి పెట్రోల్ | రూ. 35,02,000 | రూ. 44,000 |
4x2 ఎంటిడీజిల్ | రూ. 35,93,000 | రూ. 44,000 |
4x2 ఎటి డీజిల్ | రూ. 38,21,000 | రూ. 44,000 |
4x4 ఎంటిడీజిల్ | రూ. 40,03,000 | రూ. 70,000 |
4x4 ఎటి డీజిల్ | రూ. 42,32,000 | రూ. 70,000 |
GR-S | రూ. 51,44,000 | రూ. 70,000 |
ఫార్చూనర్ను రెండు పవర్ ట్రెయిన్స్ లో పొందవచ్చు – అవి ఏవి అంటే 2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇంతకు ముందున్న ఇంజిన్ 164bhp మరియు 245Nm టార్క్ ను జనరేట్ చేస్తే, ప్రస్తుత ఇంజిన్ 201bhp మరియు 500Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఆప్షనల్ 4x4 సిస్టంతో ట్రాన్స్మిషన్ విధులను నిర్వహించనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్