- నవంబర్ 1 నుండి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ధరల పొడిగింపు
- రూ.17.80 లక్షలతో ప్రారంభంకానున్న హెక్టర్ ప్లస్ రేంజ్ కొత్త ధరలు
ఎంజి మోటార్ ఇండియా హెక్టర్ రేంజ్ ధరలను నవంబర్ 1, 2023 నుండి పెంచడానికి సిద్ధంగాఉంది. హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఈ రెండింటిపై రూ. 40,000 వరకు ధరలు పెరగనున్నాయి. హెక్టర్ ప్లస్ రేంజ్ ధరలు రూ. 17.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్ వేరియంట్స్ పై ధరలు రూ.35,000 వరకు, డీజిల్ వేరియంట్స్ ప్రీమియంపై అదనంగారూ. 40,000 వరకు పెరగనున్నాయి. దీనికి అదనంగా ఆయా వేరియంట్స్ ని బట్టి డ్యూయల్-టోన్ వేరియంట్స్ పై అదనంగా ధరరూ. 20,000 పెరగనుంది.మొత్తంగా చూస్తే, సెలెక్ట్ వేరియంట్స్ పై ధరలు రూ. 35,000 వరకు తగ్గుతాయి.
ఎంజి మోటార్ ఇండియా దేశమంతటా తన మిడ్-సైజ్ ఎస్యువి హెక్టర్ ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది. ఈ పొడిగించిన ధరలు నవంబర్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తాజా అప్డేట్తో, హెక్టర్ ఎస్యువి ధరలు రూ. 40,000. వరకు పెంచబడతాయి.
పెట్రోల్ వేరియంట్స్ ని చూస్తే దీనిపై రూ.35,000 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు, డీజిల్ వెర్షన్స్ ధర రూ. 40,000 వరకు పెరిగింది. ప్రత్యేకంగా, డ్యూయల్-టోన్ వేరియంట్స్ లో స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే ప్రేమియం వెర్షన్ పై రూ.20,000 వరకు పెరిగాయి.దీనితో, హెక్టర్ ధర రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
అనువాదించిన వారు:రాజపుష్ప