- జనవరి 16న లాంచ్ కానున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్
- పెట్రోల్ మరియు డీజిల్ టైప్స్ లో 7 వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్న క్రెటా
కొన్ని రోజుల క్రితం, కొరియన్ ఆటోమేకర్ హ్యుందాయ్ దేశవ్యాప్తంగా క్రెటా ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు 5-సీటర్ ఎస్‍యూవీని బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ లేదా అధికారిక హ్యుందాయ్ డీలర్ షిప్ ని సందర్శించి కేవలం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు, అధికారిక లాంచ్ కు ముందుగా కియా సెల్టోస్ తో పోటీ పడుతున్న ఈ క్రెటా ఫేస్‍లిఫ్ట్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ని మనం తెలుసుకుందాం.
రిపోర్ట్స్ ప్రకారం, 2024 క్రెటా పెట్రోల్ వేరియంట్స్ పై 3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుండగా, డీజిల్ వేరియంట్స్ పై 4 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. పైన పేర్కొనబడిన వెయిటింగ్ పీరియడ్ ఆయా ప్రాంతాలు, డీలర్ షిప్స్, వేరియంట్స్, కలర్స్, పవర్ ట్రెయిన్స్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. దీనిని సంబందించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్ షిప్ ని సందర్శించగలరు.
ఫేస్‍లిఫ్టెడ్ క్రెటా E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O) అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. పవర్ ట్రెయిన్స్ పరంగా, కస్టమర్లు ఈ ఎస్‍యూవీని 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, లేదా 1.5-లీటర్ డీజిల్ నుండి ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి, మరియు సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్