- 2024లో ఇండియాలో లాంచ్ కానున్న కొత్త కియా కార్నివాల్
- 7-సీట్ మరియు 9-సీట్ లేఅవుట్ తో వచ్చే అవకాశం
ఇప్పుడిది అధికారికం అయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇండియాలో కొత్త కియా కార్నివాల్ 2.2-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులోకి రానుంది. ఇంజిన్ ఇండియన్-స్పెక్ కి తగ్గట్లుగా 2019 చివరలో లాంచ్ అయిన విధంగా కొత్త కారులో కూడా వచ్చే అవకాశం ఉంది.
కొత్త ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జత చేయబడి 191bhp/441Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. ఇంతకు ముందున్న మోడల్ కూడా కొత్త కార్ లాగే 197bhp మరియు 440Nmటార్కును ఉత్పత్తి చేసేది. ఇందులో జరిగిన పెద్ద మార్పు ఏంటి అంటే కొత్త కారులో ఫ్యూయల్ ట్యాంక్ 60-లీటర్స్ నుండి 72-లీటర్స్ వరకు పెరిగింది. ఇంకా దీని మైలేజ్ గురించి చెప్పాలంటే, కొరియన్-స్పెక్ కార్ 13కెఎంపిఎల్ తో 72-లీటర్స్ ఫుల్ ట్యాంక్ 936 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. దీని ప్రకారం చూస్తే, ఇండియన్ మార్కెట్లో కూడా ఈ కారు నుంచి ఇదే నంబర్స్ ని మనం ఆశించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా నవంబరు 2వ తేదీనే కియా కార్నివాల్ యొక్క ఇంటీరియర్, ఫీచర్ లిస్టు, మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్ వంటి వివరాలు వెల్లడయ్యాయి. ఇది ఇండియాలో లాంచ్ అయితే, టయోటా ఇన్నోవా హైక్రాస్, ఎంజి గ్లోస్టర్, మరియు టయోటా ఫార్చూనర్ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్