- భారీగా అప్‌డేట్స్ తో వచ్చిన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాలు
- 2024 చివరిలో ఇండియాకి చేరవచ్చు అని అంచనా
2024 రెనాల్ట్ డస్టర్ గా పిలువబడుతున్న డాసియా డస్టర్ మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. న్యూ-జెన్ ఫ్రెంచ్ ఎస్‌యువి పూర్తిగా అప్‌డేటెడ్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‍లో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ నుండి బెనిఫిట్స్ పొందింది. ఇది 2024 చివరిలో ఏ సమయంలోనైనా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించవచ్చని అంచనా.
కొత్త డస్టర్ బయటి భాగంలో, సామర్థ్యం మరియు గరుకుగా బోనెట్, చంకీ వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్ మరియు ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ సహాయంతో దీని రూపం కొంచెం గంభీరంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో, క్రోమ్ ఇన్‌సర్ట్‌లు, సరికొత్త మరియు సన్నని గ్రిల్, ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ బంపర్‌పై వెడల్పైన ఎయిర్ ఇన్‌టేక్‌లతో వై- షేప్డ్ ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ లను పొందింది. ఇది ఇప్పుడు డ్యూయల్-టోన్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అంతేకాకుండా, వెనుక డోర్ హ్యాండిల్ మునుపటి జెన్ లో డోర్‌కు అమర్చగా ఇందులో ఎదురుగా పిల్లర్‌పై అమర్చబడింది.
దీని వెనుక వైపు, ఎస్‌యువి లో స్ప్లిట్ రూఫ్ స్పాయిలర్, వై- షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు, రీవర్క్డ్ బంపర్ మరియు క్రీజ్డ్ టెయిల్‌గేట్‌తో పాటు ఇది మరింత మోడరన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరో వైపు కనిపించే హైలైట్‌లలో వాషర్‌తో కూడిన రియర్ వైపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు సాధారణమైన రేడియో యాంటెన్నా వంటి అంశాలు ఉన్నాయి.
లోపలి వైపు, అప్‌డేట్ చేయబడిన డస్టర్ క్యాబిన్ కొత్త డ్యాష్‌బోర్డ్ తో మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్‌తో మళ్ళీ సరికొత్తగా చేయబడింది. ఇది ఎయిర్‌కాన్ వెంట్‌ల పైన అమర్చిన ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెచ్ విఏసి మరియు మీడియా కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్స్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివైజ్డ్ గేర్ సెలెక్టర్ లీవర్‌ను కలిగి ఉంది.
మెకానికల్‍గా, ఇండియాలో, డస్టర్ పవర్డ్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ మోటార్‌తో రానుంది. ఎస్‌యువి లాంచ్ అయిన తర్వాత 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌ను కూడా పొందవచ్చని మేము భావిస్తున్నాము.
అందుబాటులోకి వచ్చిన తర్వాత, న్యూ-జెన్ రెనాల్ట్ డస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎంజి ఆస్టర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ , హోండా ఎలివేట్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ లతో ప్రధానంగా పోటీగా పడవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప