- 7-సీటర్ వెర్షన్ లో వస్తున్న డస్టర్
- మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో వస్తున్న డాసియా బిగ్‍స్టర్
మొత్తానికి డాసియా (రెనాల్ట్) డస్టర్ 7-సీటర్ వెర్షన్ అనే బిగ్‍స్టర్ మోడల్ ప్రపంచవ్యాప్తంగా దాని అరంగేట్రం చేసింది. న్యూ-జెన్ డస్టర్ యొక్క కొత్త అప్ డేటెడ్ వెర్షన్ 2025వ సంవత్సరంలో స్టాండర్డ్ గా 5-సీటర్ వెర్షన్ తో పాటుగా ఇండియాలో అడుగుపెట్టనుంది.
డిజైన్ పరంగా, కొత్తగా వచ్చిన బిగ్‍స్టర్ ఎస్‍యూవీ రెండు వరుసల డస్టర్ ఎస్‍యూవీ నుంచి ఎన్నో డిజైన్ అంశాలను తీసుకుంది. వీటిని మీరు చూస్తేనే చాలా ఈజీగా చెప్పేస్తారు. అందులో వై-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్ లైట్స్, చంకీ వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, మరియు పిల్లర్-మౌంటెడ్ డోర్ హ్యండిల్స్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులో అందించిన రియర్ డోర్ హ్యండిల్స్ సి-పిల్లర్ లోకి ఇంటిగ్రేట్ చేసినట్లు ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, కొత్త బిగ్‍స్టర్ ఎస్‍యూవీ లోపల చూస్తే, క్యాబిన్ అంతా కొత్త డ్యాష్ బోర్డు లేఅవుట్, సెంటర్ కన్సోల్, మరియు సీట్ అప్హోల్స్టరీతో కలిపి అచ్చం డస్టర్ ఎస్‍యూవీలాగా కనిపిస్తుంది. ఫీచర్ల పరంగా, ఈ కారు ఫ్లోటింగ్ 10.1-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, 10-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లతో వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా, కొత్త డాసియా బిగ్‍స్టర్ మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉండనుంది. అయితే, ఇండియాలో డస్టర్ మరియు బిగ్‍స్టర్ ఎస్‍యూవీలు రెండు ఇంజిన్ ఆప్షన్లతో రానుండగా, డీజిల్ వెర్షన్ కూడా అందించబడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్