- ఇండియాలో రూ. 11లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభంకానున్న ధరలు.
- రెండు గ్యాసోలిన్ మోటార్లతో 4వేరియంట్‌లలో లభించనున్న మోడల్
హ్యుందాయ్ గత ఏడాది మార్చిలో వెర్నా యొక్క సిక్స్-జనరేషన్ ను లాంచ్ చేసింది. ఈ కారు లాంచ్ అయిన ఒక సంవత్సరంలోనే ఇండియాలోని సెడాన్ కొనుగోలుదారుల నుండి అత్యధిక డిమాండ్‌ను పొందింది. దీని ఫలితంగా, ఈ మోడల్ ఇండియాలో అధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
హోండా సిటీకి పోటీగా ఉన్న ఈ మోడల్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లో EX, S, SX, మరియు SX(O) అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. 17.42 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ప్రస్తుతం, వెర్నా యొక్క అన్ని వేరియంట్లు బుకింగ్ చేసిన రోజు నుండి 4 నుండి 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నాను - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ అనే రెండు గ్యాసోలిన్ మోటార్‌లలో అందిస్తుంది. ఇందులో రెండవ ఇంజిన్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జత చేయబడి 158bhp/253Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, అయితే మొదటిది , 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్‌తో జత చేయబడి 113bhp మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లను కొంత నిరుత్సాహపరిచే అంశం ఏంటి అంటే, ఇందులో ఎలాంటి డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్ లేదు.
వెర్నా కారు ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్, స్కోడా స్లావియా, హోండా సిటీ మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటితో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప