- రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ లభ్యం
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
హ్యుందాయ్ ఇండియా వెర్నాతో సహా అన్ని కార్ల పై వెయిటింగ్ పీరియడ్ లిస్ట్ ను వెల్లడించింది.ఇది మార్చి 2023లో పరిచయం చేయగా, ఈ 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్ భారతీయుల నుండి అధిక స్పందనను పొందింది, కాబట్టి ఇది మరింత వెయిటింగ్ పీరియడ్ ను పొందిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం, హ్యుందాయ్ వెర్నా యొక్క అన్నీ వేరియంట్‌లపై బుకింగ్ చేసిన రోజు నుండి 3 నుండి 5వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాంతం, డీలర్‌షిప్, వేరియంట్, కలర్, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ మరియు ఇతర వ్యాపారిపై ఈ వెయిటింగ్ పీరియడ్ మారవచ్చు.మీకు కావాల్సిన ప్రసిద్ధమైన సమాచారాన్ని పొందడానికి మీసమీపంలోనిఅధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము.
హ్యుందాయ్ సిక్స్త్– జెన్ వెర్నాను 9 ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్స్‌లో 4 వేరియంట్స్ లో పొందవచ్చు అవి : EX, S, SX మరియు SX(O). పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, హోండా సిటీ-కి పోటీగా ఉన్న దీనిని రెండు గ్యాసోలిన్ మోటార్‌లలో పొందవచ్చు. ఇందులో113bhp మరియు 144Nm టార్క్‌ను ఉత్పత్తిచేసే 1.5-లీటర్నేచురల్లీ ఆస్పిరేటెడ్పెట్రోల్ ఇంజిన్ మరియు 158bhp మరియు 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్మిల్ ఉన్నాయి.ఇందులో ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి మరియు సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప