- ఇండియాలో రూ.7.94లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభంకానున్న ధరలు
- ఏడీఏఎస్ తో వస్తున్నట్లు నిర్ధారణ
హ్యుందాయ్ ఇండియా సెప్టెంబర్ 2023లో ఇండియన్ మార్కెట్లో అప్‌డేటెడ్ వెన్యూని లాంచ్ చేసింది. ఈ వెన్యూ నైట్ ఎడిషన్ తో పాటుగా E, S, S(O), SX, మరియు SX(O) అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్‌లో ఏడీఏఎస్ సేఫ్టీ సూట్‌తో వస్తున్న మొదటి కారు ఈ సబ్- 4- మీటర్ ఎస్‍యూవీ అని చెప్పవచ్చు. ఇప్పుడు, వెన్యూ యొక్క వెయిటింగ్ పీరియడ్‌పై ప్రత్యేక వివరాలను మేము పొందాము.
వేరియంట్ వారీగా హ్యుందాయ్ వెన్యూ యొక్క వెయిటింగ్ పీరియడ్‌లు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
ఇంజిన్ | వేరియంట్ మరియు ట్రాన్స్మిషన్ | వెయిటింగ్ పీరియడ్ |
1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ | E | 8-10 వారాలు |
S | 3-5 వారాలు | |
S(O) | 3-5 వారాలు | |
S(O) SE | 3-5 వారాలు | |
SX SE | 3-5 వారాలు | |
SX DT SE | 3-5 వారాలు | |
SX | 3-5 వారాలు | |
SX DT | 3-5 వారాలు | |
1.0-లీటర్ టర్బో-పెట్రోల్ | ఐఎంటి S(O) | 4-6 వారాలు |
ఐఎంటి SX(O) | 4-6 వారాలు | |
ఎంటి SX(O) SE | 4-6 వారాలు | |
ఎంటి SX(O) DT SE | 4-6 వారాలు | |
డిసిటి S(O) | 4-6 వారాలు | |
డిసిటి SX(O) SE | 4-6 వారాలు | |
డిసిటి SX(O) | 3-5 వారాలు | |
1.5-లీటర్ డీజిల్ | S(O) | 8-10 వారాలు |
SX | 8-10 వారాలు | |
SX(O) | 8-10 వారాలు |
ఇటీవల, హ్యుందాయ్, టాటా నెక్సాన్ కు పోటీగా ఉన్న సెలెక్టెడ్ వేరియంట్‌లపై మాత్రం ధరలను రూ. 11,900వరకు పెంచగా, ఈ వెన్యూని ఇప్పుడు రూ. 7.94 లక్షల నుండి రూ. 13.44 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) తో పొందవచ్చు. అంతేకాకుండా, దీనిని మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో పొందవచ్చు.ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప