- ఇండియాలో రూ.7.94 లక్షలతో ప్రారంభమైన వెన్యూ ధరలు
- తాజాగా లాంచ్ అయిన ఎగ్జిక్యూటివ్ ఎంటి వేరియంట్
ప్రతి నెలా ఒక్కో బ్రాండ్ నుంచి వచ్చిన ఒక్కో మోడల్ పై ఉన్న వెయిటింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది. కొన్ని మోడల్ తక్కువ వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉండగా, మరిన్ని మోడల్ ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్నాయి. అయితే, మార్చి నెలలో అన్ని హ్యుందాయ్ కార్లపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ వివరాలను మేము కలిగి ఉన్నాము. ఈ ఆర్టికల్ ద్వారా, హ్యుందాయ్ వెన్యూ సబ్-4-మీటర్ ఎస్‍యూవీపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
మార్చి-2024లో, హ్యుందాయ్ వెన్యూపై 12 వారాల పాటు వెయిటింగ్ పీరియడ్ కొనసాగనుండగా, ఇది ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ E ఎంటి వేరియంట్ పై వర్తించనుంది. కస్టమర్లు ఎవరైతే దీనిని డీజిల్ వేరియంట్లలో కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు 10 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా పెట్రోల్ వేరియంట్లపై 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ ప్రస్తుత టైమ్ లైన్ దేశవ్యాప్తంగా వర్తించనుంది.
ఇంకా చెప్పాలంటే, ఈ మార్చి నెలలో రూ.30,000 డిస్కౌంట్లతో హ్యుందాయ్ వెన్యూ అందుబాటులో ఉంది. ఈ నెల ప్రారంభంలో, ఆటోమేకర్ హ్యుందాయ్ టర్బో-పెట్రోల్ రేంజ్ లో కొత్త ఎగ్జిక్యూటివ్ ఎంటి వేరియంట్ ని ప్రవేశపెట్టగా, దీని ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూం) గా ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్